'బాహుబలి' ఫుల్ స్టొరీ లీకైంది..!!
on Jul 3, 2015
ఇండియన్ సినిమా ప్రేక్షకులు ఏంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా బాహుబలి. ఈ సినిమా ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రా రిలీజ్ కు ఇంకా వారం రోజులే గడువు వుండడంతో సోషల్ మీడియాలో ఈ సినిమా సంబంధించిన అనేక రకాల ఆసక్తికరమైన వార్తలు ప్రచారం చేస్తున్నాయి. లేటెస్ట్ గా బాహుబలి స్టొరీ ఇదే నంటూ ఓ పోస్ట్ సోషల్ సైట్స్ లో చక్కర్లు కొడుతుంది. ఆ స్టొరీ ఎలా వుందో మీరే చూడండీ..!
క్రీస్తుపూర్వం 540వ సంవత్సరంలో మహిష్మతి రాజ్యాన్ని ఓ రాజు పాలిస్తుండేవాడు. ఆయనకు ఇద్దరు కొడుకులు, ఓ కుమార్తె. వారిలో పెద్ద కుమారుడి పేరు అమరేంద్ర బాహుబలి (ప్రభాస్). రెండో కుమారుడి పేరు భల్లలదేవ (రానా), కుమార్తె పేరు శివగామి (రమ్యకృష్ణ). పిల్లలు పెద్దవారైన తర్వాత మహిష్మతి రాజు తన రాజ్యనికి అమరేంద్ర బాహుబలిని అధిపతి చేస్తాడు. ఆయన భార్య దేవసేన (అనుష్క). వారి పాలనలో ప్రజలు సుఖశాంతులతో జీవిస్తూ ఉంటారు.
అయితే, స్వార్థపరుడైన మంత్రి బిజ్జలదేవ (నాజర్), బాహుబలి సోదరుడు భల్లలదేవ కలిసి అమరేంద్ర బాహుబలిని చంపి రాజ్యాన్ని తమ హస్తగతం చేసుకుంటారు. అప్పటి నుంచి తమ ఇష్టానుసారంగా రాజ్యపాలన సాగిస్తుంటారు. పైగా… రాజ్యం తమ అధీనంలోకి వచ్చాక తన విగ్రహాన్ని ప్రతిష్టించుకుంటాడు భల్లలదేవ. అంతేకాదు ప్రజలను తమ బానిసలుగా చూస్తూ హింసలకు గురి చేస్తుంటాడు. పసివాడైన బాహుబలి కుమారుడుని కూడా చంపడానికి ప్రయత్నిస్తాడు.
అయితే దేవసేన తన కుమారుడిని కాపాడి రాజ్యం దాటిస్తుంది. అనంతరం భల్లలదేవ సైన్యం దేవసేనను బంధిస్తుంది. మరోవైపు బాహుబలి కుమారుడిని కొందరు గ్రామస్తులు కాపాడి.. పెంచి పెద్దచేసి అతనికి శివుడు (ప్రభాస్) అని పేరు పెడతారు. తన తండ్రి పోలికలతోనే ఉండే శివుడు అందర్నీ తన ధైర్య సాహసాలతో ఆకర్షిస్తూ ఉంటాడు. ఇలాంటి పరిస్థితులలో తన ప్రాంతానికి రాజకుమారి అవంతిక (తమన్నా) వస్తుంది. ఆమె అందం చూసి శివుడు ఆమెని ప్రేమిస్తాడు.
ఆ తర్వాత శివుడు అవంతికను వెతుక్కుంటూ మహిష్మతి రాజ్యానికి వెళ్తాడు. అక్కడ శివుడు తన గతం గురించి తెలుసుకొని క్రూరుడైన భల్లలదేవపై ప్రతీకారం తీర్చుకొని రాజ్యాన్ని, ప్రజలను, తన తల్లిని ఎలా సొంతం చేసుకొన్నాడు అనేదే “బాహుబలి” చిత్ర కథ. మరి ఈ కథ నిజంగా రాజమౌళి బాహుబలి కథనా?కాదా తెలియాలంటే మనం ఓ వారం రోజులు ఓపిక పట్టాల్సిందే..!