పోలీసు నోటిసులని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు పత్రంలా అందుకున్నాడు
on Nov 13, 2024
ఆంధ్రప్రదేశ్ లో మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికలకి ముందు ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(ram gopal varma)వ్యూహం అనే సినిమాని తెరకెక్కించాడు.ఆ సినిమా రిలీజ్ టైం లో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(chandrababu naidu)కుటుంబ సభ్యులతో పాటు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(pawan kalyan)యొక్క వ్యక్తిత్వాలని కించపరుస్తూ వర్మ సోషల్ మీడియా వేదికగా కొన్ని పోస్ట్ లు చెయ్యడం జరిగింది.దీంతో వర్మపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో ఒక వ్యక్తి కంప్లైంట్ చెయ్యడం జరిగింది.
దీంతో ఇప్పుడు మద్దిపాడు(maddipadu)పోలీసులు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని వర్మ ఇంటికి వచ్చి విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇవ్వడం జరిగింది. పోలీసులు వచ్చే సమయానికి వర్మ ఇంట్లోనే ఉండటంతో తనే నోటీసులు అందుకున్నాడు.మరో వైపు ఏపీ రాజధానికి కీలక ప్రాంతమైన తుళ్లూరు లో కూడా వర్మ పై పోలీసు కేసు నమోదు అయ్యింది.ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్, లోకేష్ ఫొటోల్ని వర్మ మార్ఫింగ్ చేసి అసభ్య పదజాలంతో వాటిని సామజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసాడని, కాబట్టి వర్మ పై కఠిన చర్యలు తీసుకోవాలని సదరు వ్యక్తి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.