ప్రకాష్‌రాజ్ తిట్లకు స్పృహ తప్పిన హీరోయిన్
on Jul 12, 2018
సీనియర్ నటుడైన ప్రకాష్‌రాజ్ నటనలో చెలరేగిపోతాడని ఓ పేరుంది. దాంతో పాటే అప్పుడప్పుడూ సెట్లో కూడా చెలరేగిపోతారన్న అపవాదూ ఉంది. ఆ కారణంగానే శ్రీను వైట్ల వంటి దర్శకులతో వివాదాలు కూడా ఏర్పడ్డాయి. ఇప్పుడు తాజాగా ప్రకాష్‌రాజ్ తిట్లకి సంబంధించి మరో వార్త షికారు చేస్తోంది. ‘హలో గురు ప్రేమ కోసమే’ సినిమాలో రామ్ సరసన అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న విషయం తెలిసిందే! ఈ సినిమాలో ప్రకాష్‌రాజ్ ఓ ముఖ్యపాత్రని పోషిస్తున్నారు. అయితే ఓ సీన్ విషయంలో అనుపమ సరిగ్గా చేయలేదంటూ ఆవిడని వాయించి పారేశాడట. దాంతో అనుపమ నొచ్చుకుని ఏకంగా స్పృహ తప్పినట్లు సమాచారం. ఈ విషయం బయటకి పొక్కడంతో, అక్కడ పెద్ద గొడవేమీ జరగలేదంటూ సర్దిచెప్పే ప్రయత్నాలు చేసింది చిత్రబృందం. అంతేకాదు! అనుపమ పరమేశ్వరన్‌ని ప్రకాష్‌రాజ్‌తో ఒక సెల్పీ తీయించింది.