Andhra King Taluka: ఆంధ్ర కింగ్ తాలూకా ఎలా ఉంది.. రామ్ ఖాతాలో హిట్ పడిందా..?
on Nov 27, 2025
.webp)
చాక్లెట్ బాయ్ గా, ఎనర్జిటిక్ స్టార్ గా రామ్ పోతినేనికి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే తన ఇమేజ్ కి భిన్నంగా గత కొన్నేళ్లుగా ఎక్కువగా మాస్ సినిమాలు చేసి, పరాజయాలను చూశాడు. దీంతో ఇప్పుడు రూట్ మార్చి, యూత్ కి నచ్చే 'ఆంధ్ర కింగ్ తాలూకా' అనే సినిమా చేశాడు. పైగా, ఇది ఒక అభిమాని బయోపిక్ గా అందరి హీరోల అభిమానులకు కనెక్ట్ అయ్యే కథతో రూపొందింది. నేడు(నవంబర్ 27) థియేటర్లలో అడుగుపెట్టిన ఈ సినిమా ఎలా ఉంది? రామ్ ఖాతాలో హిట్ పడిందా? (Andhra King Taluka)
ఇప్పటికే కొన్ని చోట్ల 'ఆంధ్ర కింగ్ తాలూకా' మొదటి షోలు పూర్తయ్యాయి. పరవాలేదు, బాగుంది అనే మాటలు వినిపిస్తున్నాయి కానీ, పూర్తిగా నెగెటివ్ టాక్ మాత్రం ఎక్కడా లేదు. దీనిని బట్టి ఈ సినిమా ఫస్ట్ టెస్ట్ పాస్ అయినట్టే.
Also Read: ఆంధ్ర కింగ్ తాలూకా ట్విట్టర్ రివ్యూ.. అసలు ఊహించలేదు..!
'ఆంధ్ర కింగ్ తాలూకా'లో హీరో-అభిమాని ట్రాక్ తో పాటు, లవ్ స్టోరీ బాగుందని.. ముఖ్యంగా సినిమాలో ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయ్యాయని అంటున్నారు. కొన్ని కొన్ని సీన్స్, డైలాగ్స్ వావ్ అనిపించేలా ఉన్నాయని.. ప్రతి హీరో అభిమానికి కనెక్ట్ అయ్యే మూమెంట్స్ ఎన్నో ఉన్నాయని చెబుతున్నారు.
Also Read: ఆంధ్ర కింగ్ తాలూకా ఫస్ట్ రివ్యూ!
నిజానికి ఈ మూవీపై ట్రైలర్ తోనే పాజిటివ్ వైబ్స్ వచ్చాయి. సెన్సార్ రిపోర్ట్ కూడా పాజిటివ్ గానే వచ్చింది. అయితే తెలుగులో ఇలా హీరో అభిమాని కథతో రూపొందిన 'శీనుగాడు చిరంజీవి ఫ్యాన్', 'ఒక వి చిత్రం' వంటి సినిమాలు హిట్ కాకపోవడంతో.. ఆ నెగెటివ్ సెంటిమెంట్ 'ఆంధ్ర కింగ్ తాలూకా'ను వెంటాడింది. అయితే ఇప్పుడు మొదటి షోకి వస్తున్న పాజిటివ్ టాక్ ని బట్టి చూస్తే.. ఆ నెగెటివ్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యి, రామ్ ఖాతాలో హిట్ పడినట్లే అని చెప్పవచ్చు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



