Akhanda 2 Thaandavam: అఖండ-2 ఇంటర్వెల్.. ఏం హై రా బాబు...
on Nov 27, 2025

డిసెంబర్ 5న అఖండ తాండవం
బీజీఎం పూర్తి చేసిన తమన్
గూస్ బంప్స్ తెప్పించేలా ఇంటర్వెల్
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను, ఎస్.తమన్ కాంబినేషన్ లో వచ్చిన 'అఖండ' ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా వస్తున్న 'అఖండ-2'పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. డిసెంబర్ 5న థియేటర్లలో అడుగుపెట్టనున్న ఈ చిత్రంతో బాలయ్య-బోయపాటి-తమన్ త్రయం మరోసారి సంచలనం సృష్టించడానికి సిద్ధమవుతోంది. (Akhanda 2 Thaandavam)
అఖండ విజయంలో తమన్ నేపథ్య సంగీతం కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. నందమూరి తమన్ గా పేరు పడిపోయింది అంటే.. ఏ రేంజ్ లో బీజీఎం ఇచ్చాడో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు 'అఖండ-2'తో అంతకుమించిన మ్యాజిక్ చేయబోతున్నాడు.
Also Read: ఆంధ్ర కింగ్ తాలూకా ఎలా ఉంది.. రామ్ ఖాతాలో హిట్ పడిందా..?
ట్రైలర్ తోనే 'అఖండ-2' బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఏ స్థాయిలో ఉండబోతుందో క్లారిటీ వచ్చింది. తాజాగా ఈ సినిమా బీజీఎం వర్క్ పూర్తయింది. ఈ విషయాన్ని మేకర్స్ తాజాగా అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు, తమన్ అందించిన స్కోర్ కి మూవీ టీమ్ ఫిదా అయిందట. గూస్ బంప్స్ తెప్పించేలా తమన్ మ్యూజిక్ ఉందని అంటున్నారు.

Also Read: బాలయ్య తాండవానికి సోషల్ మీడియా షేక్
ఇక తమన్ స్కోర్ పట్ల మూవీ టీమ్ ఎంత హ్యాపీగా ఉందో.. ఈ సినిమా అవుట్ పుట్ పట్ల తమన్ కూడా అంతే హ్యాపీగా ఉన్నాడు. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్ చూసి సర్ ప్రైజ్ అయ్యాడట. ఈ విషయాన్ని తెలియజేస్తూ "ఏం హై రా బాబు.. అఖండ ఇంటర్వెల్" అంటూ తమన్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది.
'అఖండ-2'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. నవంబర్ 28 సాయంత్రం హైదరాబాద్ లో ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ ఈవెంట్ తరువాత అంచనాలు మరింత పెరిగే అవకాశముంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



