దివాలి విన్నర్ ఎవరు
on Nov 1, 2024

'క',(ka)అమరన్(amaran)లక్కీ భాస్కర్(lucky baskhar)బఘీర(bagheera)వంటి హై బడ్జట్ సినిమాలు దివాలి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.దీంతో సంక్రాంతి పండుగకి ఏ విధంగా అయితే ప్రేక్షకులతో థియేటర్స్ కళకళలాడుతుంటాయో, దివాలి కి కూడా థియేటర్లు కళకళలాడుతున్నాయి. మరి ఈ నాలుగు సినిమాల్లో ఏ సినిమా దివాలి విన్నర్ గా నిలిచిందో చూద్దాం.
నాలుగు సినిమాలకి కూడా ప్రేక్షకులు మొదటి ఆట నుంచే పోటెత్తారు.పైగా అమరన్, లక్కీ భాస్కర్, 'క' వంటి సినిమాలకి ఒక రోజు ముందుగానే ప్రీమియర్ షోస్ కూడా వెయ్యడం జరిగింది.కథ, కథనాల పరంగా ఆ నాలుగు చిత్రాలు కూడా ప్రేక్షకులని పర్లేదనే స్థాయిలో అలరిస్తున్నాయనే టాక్ అయితే వినిపిస్తుంది.కాకపోతే ఎక్కువ మంది ప్రేక్షకులు మాత్రం శివ కార్తికేయన్, సాయి పల్లవి జంటగా వచ్చిన రియలిక్ స్టోరీ అమరన్ మొదటి స్థానంలో నిలిచిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఆ తర్వాత స్థానంలో లక్కీ భాస్కర్ నిలవగా 'క', బఘీర చిత్రాలు మూడు నాల్గవ స్థానాల్లో నిలిచాయని అంటున్నారు.అమరన్ మొదటి రోజు వరల్డ్ వైడ్ గా ముప్పై నాలుగు కోట్ల గ్రాస్ ని రాబట్టగా, లక్కీ భాస్కర్ ఇండియా వైడ్ గా ఏడూ కోట్ల యాభై లక్షల రూపాయిల నెట్ 'క' మూవీ మూడు కోట్ల డెబ్భై ఐదు లక్షలు, బఘీర మూవీ రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయలని సాధించాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



