ఆ రెండు సినిమాలు లేవు.. కానీ ఆ రెండు మాత్రం ఉన్నాయి
on Apr 4, 2024
ఏంటి బన్నీఇలా అయితే ఎలా చెప్పు..వాళ్ళు ఎంతగా బాధపడతారో కాస్తయినా ఆలోచించావా. అసలు వాళ్ళు ఎన్ని ప్లాన్స్ వేసుకున్నారో తెలుసా! ఇప్పుడు ఆ ప్లాన్స్ మొత్తం ఒక్కసారిగా చెల్లా చెదురు అయిపోయాయి. ఏప్రిల్ 8 డేట్ దగ్గరపడేకొద్దీ వాళ్లలో పెరిగిన జోష్ ఇప్పుడు ఒక్కసారిగా పోయింది. ఇంతకీ బన్నీ ఏం చేసాడు? అసలు వాళ్లెవరో చూద్దాం.
అల్లు అర్జున్ (allu arjun)ఆర్మీ.. సాధారణంగా ఏ హీరోకైనా అభిమానులు ఉంటారు. కానీ బన్నీ కి మాత్రం ఆర్మీ నే ఉంది. దీన్ని బట్టి బన్నీ ని ఎంతగా అభిమానిస్తారో అర్ధం చేసుకోవచ్చు. అలాంటి ఆర్మీ ఇప్పుడు కొద్దిగా డల్ అయ్యింది. ఏప్రిల్ 8 న బన్నీ పుట్టిన రోజు.లక్షలాది మంది అభిమానులు ఎవ్రి ఇయర్ ఒక వేడుకలా జరుపుకుంటారు.ఈ నేపథ్యంలో ఆర్య 2 , జులాయి సినిమాలు రీ రిలీజ్ చేస్తామని మొదట ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ థియేటర్స్ లో రచ్చ రచ్చ చెయ్యడానికి రెడీ అయ్యారు. కానీ ఇప్పుడు రిలీజ్ అవ్వడం లేదు. కారణాలు తెలియదు గాని రిలీజ్ అయితే ఆపేసారు. దీంతో ఫ్యాన్స్ డీలాపడ్డారు.
కాకపోతే వాళ్ళకి కొద్దిగా ఊరటనిచ్చే అంశం ఏంటంటే బర్త్ డే కి పుష్ప 2 (pushpa 2) టీజర్ రిలీజ్ అవ్వబోతుంది. దీంతో టీజర్ చూడాలనే ఆతృత ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లో కూడా ఏర్పడింది. అదే విధంగా కొత్త సినిమాకి సంబంధించిన ప్రకటన కూడా రానుంది.ఇక బన్నీ 2003 వ సంవత్సరంలో వచ్చిన గంగోత్రి తో తన సినీ జర్నీని ప్రారంభించాడు.ఇక అక్కడ్నుంచి వెనుతిరిగి చూసుకునే అవకాశం రాలేదు. డాన్స్ ఫైట్స్ కి తన సత్తా చాటుతూ స్టైలిస్ట్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మారాడు. సౌత్ లోనే ఒక అగ్ర హీరోగా వెలుగొందుతున్నారు.
Also Read