Mana Shankara Vara Prasad Garu: ఇది సంక్రాంతి బ్లాక్ బస్టర్ కాదు.. అల్లు అర్జున్ సంచలన ట్వీట్!
on Jan 20, 2026

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Vara Prasad Garu). అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో నయనతార హీరోయిన్ గా నటించగా, వెంకీ గౌడ అనే ప్రత్యేక పాత్రలో విక్టరీ వెంకటేష్ సందడి చేశారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో అడుగుపెట్టిన ఈ మూవీ బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. ఇప్పటికే రూ.300 కోట్ల గ్రాస్ మార్క్ కి చేరువైంది. తాజాగా ఈ చిత్రాన్ని ప్రశంసిస్తూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ట్వీట్ చేయడం విశేషం.
రీసెంట్ గా 'మన శంకర వరప్రసాద్ గారు' చూసిన అల్లు అర్జున్.. సినిమాపై ప్రశంసల వర్షం కురిపించాడు.
"మన శంకర వరప్రసాద్ గారు మూవీ టీమ్ మొత్తానికి అభినందనలు. ది బాస్ ఈజ్ బ్యాక్. వింటేజ్ వైబ్స్ తో మన మెగాస్టార్ చిరంజీవి గారు మళ్ళీ స్క్రీన్స్ పై వెలుగులు నింపడం సంతోషంగా ఉంది. వెంకీ గౌడగా వెంకటేష్ గారు అదరగొట్టారు.
నయనతార, కేథరిన్ థ్రెసా, బుల్లిరాజు సహా అందరూ అద్భుతంగా నటించారు. భీమ్స్ గారు విజిల్స్ కొట్టించే పాటలు అందించారు. నిర్మాతలలో ఒకరైన మా కజిన్ సుష్మిత కొణిదెలకి, సాహు గారపాటి గారికి అభినందనలు.
సంక్రాంతి బ్లాక్ బస్టర్ మెషిన్ అనిల్ రావిపూడి గారికి బిగ్ కంగ్రాట్స్. ఆయన సంక్రాంతికి వస్తారు.. హిట్ కొడతారు.. రిపీట్.
ఇది సంక్రాంతి బ్లాక్ బస్టర్ కాదు.. సంక్రాంతి బాస్ బస్టర్." అని అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు.
ప్రస్తుతం అల్లు అర్జున్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read: 'మన శంకర వరప్రసాద్ గారు' మూవీ రివ్యూ
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



