ఓటీటీలో అల్లరి నరేష్ ఉగ్రరూపం!
on May 31, 2023
'నాంది' వంటి హిట్ తర్వాత అల్లరి నరేష్, విజయ్ కనకమేడల కలయికలో రూపొందిన రెండో చిత్రం 'ఉగ్రం'. షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈ సినిమా మే 5న థియేటర్లలో విడుదలైంది. 'నాంది' స్థాయిలో విజయం సాధించలేకపోయినప్పటికీ, పరవాలేదు అనిపించుకుంది. ముఖ్యంగా నరేష్ నటనకు, యాక్షన్ సన్నివేశాలకు మంచి మార్కులు పడ్డాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో అలరించడానికి సిద్ధమవుతోంది.
'ఉగ్రం' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. అయితే థియేటర్స్ లో విడుదలైన నాలుగు వారాలకే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. జూన్ 2 నుంచి 'ఉగ్రం' సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని అమెజాన్ ప్రైమ్ ప్రకటించింది. మరి ఈ సినిమాకి ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.
మిర్నా మీనన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించాడు. తూమ్ వెంకట్ కథ అందించగా, సినిమాటోగ్రాఫర్ గా సిద్ధార్థ్ జె, ఎడిటర్ గా చోటా కె. ప్రసాద్ వ్యవహరించారు.
Also Read