అఖిల్... 'పూజ'కు వేళాయెరా!
on Sep 20, 2019
శ్రీదేవిగా పూజా హెగ్డే వెండితెర మీదకు వచ్చేది ఈ రోజే (సెప్టెంబర్ 20). 'ఎల్లువచ్చి గోదారమ్మ ఎల్లకిల్లా పడ్డదమ్మో' అంటూ శ్రీదేవి ఐకానిక్ కల్ట్ క్లాసిక్ సాంగ్ రీమిక్స్ తో థియేటర్లలో సందడి చేసేది ఈ రోజు నుండే. అలాగే, అఖిల్ అక్కినేనితో తొలిసారి తెరను పంచుకుంటున్న సినిమా చిత్రీకరణ ప్రారంభించినది కూడా ఈ రోజే. 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అందులో పూజా హెగ్డే హీరోయిన్. ఈ రోజు నుండి సినిమా షూటింగులో పాల్గొంటున్నారామె. ఉదయం ఏడు గంటలకు సినిమా షూటింగ్ మొదలైంది. ఇంతకు ముందు 'ఒక లైలా కోసం'లో అక్కినేని నాగచైతన్యకు జంటగా పూజా హెగ్డే నటించారు. అఖిల్ అక్కినేనితో ఆమెకు ఇది తొలి సినిమా. ఇది కాకుండా అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరక్కుతున్న సినిమాలో పూజా హెగ్డే నటిస్తున్నారు.