కరోనా ఎఫెక్ట్.. 'మేజర్' మూవీ విడుదల వాయిదా!
on Jan 24, 2022

కరోనా థర్డ్ వేవ్ కారణంగా ఇప్పటికే పలు సినిమాలు వాయిదా పడ్డాయి. సంక్రాంతికి విడుదల కావాల్సిన 'ఆర్ఆర్ఆర్', 'రాధేశ్యామ్' తో పాటు ఫిబ్రవరి 4 న విడుదల కావాల్సిన 'ఆచార్య' సినిమా ఆ లిస్ట్ లో ఉన్నాయి. ఇలా ఇప్పటికే పలు సినిమాలు వాయిదా పడగా ఇప్పుడు ఆ లిస్ట్ లో మరో సినిమా వచ్చి చేరింది. అదే యంగ్ హీరో అడవి శేష్ నటించిన పాన్ ఇండియా మూవీ 'మేజర్'.
మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా 'మేజర్'. శశి కిరణ్ తిక్కా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఫిబ్రవరి 11 న విడుదల కానున్నట్లు గతంలో మూవీ టీమ్ ప్రకటించింది. అయితే కరోనా థర్డ్ వేవ్ కారణంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు తాజాగా మూవీ టీమ్ తెలిపింది. దేశం కోసం తెరకెక్కించిన మేజర్ సినిమాని.. దేశంలోని పరిస్థితులు అన్ని చక్కబడ్డాక విడుదల చేస్తామని, త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని మూవీ టీమ్ పేర్కొంది.

GMB ఎంటర్‌టైన్‌మెంట్, ఏప్లస్ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న మేజర్ సినిమాలో సాయి మంజ్రేకర్ హీరోయిన్. శోభితా ధూళిపాళ, ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



