ఎన్టీఆర్ సినిమా ట్రైలర్ రిలీజ్..పండుగ చేసుకుంటున్న ఫ్యాన్స్
on Nov 14, 2023

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అండ్ వి వి వినాయక్ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ సినిమాల్లో అదుర్స్ కూడా ఒకటి. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ పోషించిన ఈ మూవీ నవంబర్ 18 న ప్రపంచ వ్యాప్తంగా రీ రిలీజ్ కి సిద్దమవుతుంది. అదుర్స్ మూవీ కోసం ఎన్టీఆర్ ఫాన్స్ తో పాటు సాధారణ సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ ఆనందాన్ని రెట్టింపు చేసేలా అదుర్స్ మూవీ నుంచి వచ్చిన ఒక తాజా అప్ డేట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఎన్నో సినిమాల్లో అదుర్స్ కూడా ఒకటి. ఈ మూవీలో నరసింహ అనే మాస్ క్యారెక్టర్లో చారి అనే ఒక క్లాస్ బ్రాహ్మణ క్యారెక్టర్లో ఎన్టీఆర్ వీరవిహారం చేసాడు. తాజాగా అదుర్స్ రీ రిలీజ్ కి సంబందించిన ట్రైలర్ విడుదల అయ్యింది.ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే వస్తున్న కొత్త సినిమా ట్రైలర్ ని చూస్తున్నట్టుగా ఫ్రెష్ గా చాలా బాగుందని అంటున్నారు.
ఎన్టీఆర్ కామెడీ ని కూడా ఇరగదీయగలడు అని నిరూపించిన ఈ మూవీ లో ఎన్టీఆర్ సరసన నయనతార ,షీలా హీరోయిన్లుగా నటించగా బ్రహ్మానందం , నాజర్, తనికెళ్ళ భరణి, శంకరాభరణం రాజ్యలక్ష్మి, ఆశిష్ విద్యార్థి, మహేష్ మంజ్రేకర్ ,ఎంఎస్ నారాయణ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో వచ్చిన సాంగ్స్ కూడా సూపర్ హిట్ గా నిలిచాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



