పోలీసులను ఆశ్రయించిన సినీ నటి స్నేహా!
on Nov 18, 2021

సినీ నటి స్నేహ పోలీసులను ఆశ్రయించారు. ఇద్దరు వ్యాపారవేత్తలు తన వద్ద అప్పుగా డబ్బులు తీసుకొని తిరిగి ఇవ్వమంటే బెదిరింపులను దిగుతున్నారంటూ చెన్నైలోని కానత్తూర్ పోలీస్ స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేశారు.
చెన్నైలోని ఓ ఎక్స్‌పోర్ట్ కంపెనీకి చెందిన ఇద్దరు వ్యాపారవేత్తలు తన వద్ద రూ.26 లక్షలు అప్పుగా తీసుకున్నారని స్నేహా తెలిపారు. తన డబ్బులు తిరిగి ఇవ్వమన్నందుకు వారు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎలాగైనా వారివద్ద నుంచి డబ్బులు వసూలు చేయించాలని ఆమె పోలీసులను కోరారు. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో పలు చిత్రాల్లో నటించిన స్నేహా సౌత్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కోలీవుడ్ నటుడు ప్రసన్నను 2012లో ఆమె వివాహం చేసుకొన్నారు. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



