'లే లే తగ్గేదేలే'.. ఇది పుష్ప రాజ్ అడ్డా!
on Nov 19, 2021

అల్లు అర్జున్- సుకుమార్- దేవిశ్రీప్రసాద్ కాంబినేషన్ లో సాంగ్స్ కి స్పెషల్ క్రేజ్ ఉంటుంది. వీరి కాంబినేషన్ లో వచ్చిన 'ఆర్య', 'ఆర్య-2' సినిమాలు మ్యూజికల్ గా ఎంత పెద్ద హిట్ అయ్యయో తెలిసిందే. ఇప్పుడు వీరి కాంబోలో వస్తున్న 'పుష్ప' కూడా మ్యూజికల్ గా అంతకుమించి హిట్ కానుంది అనిపిస్తోంది. పుష్ప నుంచి ఇప్పటికే విడుదలైన మూడు సాంగ్స్ దాక్కో దాక్కో మేక, శ్రీవల్లి, సామి సామి లకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా పుష్ప నాలుగో సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్.
'ఏయ్ బిడ్డా..ఇది నా అడ్డా' అంటూ సాగే పుష్ప నాలుగో సాంగ్ లిరికల్ వీడియో శుక్రవారం విడుదలైంది. పుష్ప పవర్ ఏంటో తెలియజేసేలా ఉన్న ఈ ఊర మాస్ సాంగ్ ఆకట్టుకుంటోంది. దేవిశ్రీ సంగీతం, చంద్రబోస్ సాహిత్యం ఆకట్టుకుంటున్నాయి. 'ఆ తప్పూ నేనే.. ఈ ఒప్పూ నేనే.. తప్పొప్పులు తగలెట్టే నిప్పూ నేనే' వంటి లైన్స్ పవర్ ఫుల్ గా ఉన్నాయి. నకాశ్ అజీజ్ వాయిస్ ఈ సాంగ్ కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక లిరికల్ వీడియోలో బన్నీ ఎక్స్ ప్రెషన్స్, బాడీ ల్యాంగ్వేజ్ చూస్తుంటే పుష్ప రాజ్ పాత్రలో జీవించేశాడు అనిపిస్తుంది.
పుష్పలో బన్నీ సరసన రష్మిక మందాన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఫాహద్ ఫాజిల్, సునీల్, అనసూయ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న పుష్ప రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం 'పుష్ప ది రైజ్' డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



