కేరక్టర్ కోసం తెగించేసింది
on Jul 3, 2017
కావల్సినంత గ్లామర్, మంచి ప్రతిభ ఉండి కూడా పాపం నటి పూర్ణకు అవకాశాలు మాత్రం పెద్దగా లేవు. కానీ ఇలాంటి సందర్భంలో కూడా తమిళంలో పెద్ద సాహసమే చేసేసింది పూర్ణ. ఏకంగా పాత్ర కోసం గుండు కొట్టించుకోడానికి సిద్ధపడిపోయింది. పైగా ఆ సినిమాలో పూర్ణ హీరోయిన్ కూడా కాదట. ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తోందట. మరి అలాంటప్పుడు ఇంత తెగింపు అవసరమా అంటే... ’’పాత్రల కోసం కొన్ని త్యాగాలు తప్పవు.‘‘ అని భారీ స్టేట్మెంట్ ఇచ్చేసింది పూర్ణ. ’’మనసుకు నచ్చిన పాత్ర దొరికితే... ఎలాంటి త్యాగానికైనా సిద్దమే‘‘ అని అందరినీ అవాక్కయ్యేలా చేసింది పూర్ణ. మరి గుండులో పూర్ణ ఎలా ఉంటుందో చూడాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.