800 మందికి వండి అన్నదానం చేసిన ప్రముఖ హీరో
on Feb 14, 2024
తెలుగుచిత్ర పరిశ్రమకి చెందిన ఎంతో మంది హీరోలు కేవలం తెర మీద మాత్రమే కాకుండా తెర వెనుక కూడా నిజమైన హీరోలు అని అనిపించుకుంటారు.ఈ విషయం చాలా సార్లు చాలా సందర్భాల్లో రుజువయ్యింది.తాజాగా మరోసారి ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఆ న్యూస్ వైరల్ గా మారింది.
హీరో నందు గురించి ప్రత్యేకంగా పరిచయ వ్యాఖ్యానాలు అవసరంలేదు. సినిమాలు వెబ్ సిరీస్ లు చేస్తునే క్రికెట్ యాంకర్ గాను ఫుల్ బిజీగా ఉన్నాడు. తాజాగా నందు తన కుటుంబంతో కలిసి శ్రీ విద్యాపీఠంలో అన్నపూర్ణార్చన చేసాడు. అనంతరం సుమారు 800 మందికి దాకా అన్నదాన కార్యక్రమాన్ని నందు జరిపించాడు.ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే తాను కూడా వంట వాళ్ళతో కలిసి వంటలు రెడీ చేసాడు. అలాగే అందరికి వడ్డన కూడా చేసాడు. పైగా కార్యక్రమం మొత్తం అయిపోయాక వంట పాత్రలని కూడా శుభ్రం చేసాడు. ఈ విషయం మొత్తాన్ని నందు వీడియో రూపంలో తన ఇనిస్టాగ్రమ్ లో పోస్ట్ చెయ్యడంతో ఇప్పుడు ఈ విషయం వైరల్ అవుతుంది. అలాగే ఆ వీడియోని చూసిన అందరు నందుని మెచ్చుకుంటున్నారు.
2006 లో సినీరంగ ప్రవేశం చేసిన నందు 20 కి పైగా సినిమాల్లో హీరోగా చేసాడు.కానీ సరైన బ్రేక్ మాత్రం రాలేదు. లేటెస్ట్ గా వధువు అనే వెబ్ సిరీస్ నందు కి మంచి పేరు తెచ్చిపెట్టింది. ప్రముఖ గాయని గీత మాధురి నందు భార్య అనే విషయం అందరికి తెలిసిందే. వీళిద్దరకి లేటెస్ట్ గా ఒక బాబు పుట్టాడు.ఇంతకు ముందే ద్రాక్షాయని అనే పాప కూడా ఉంది.