'మధురం' దర్శకుడితో మైత్రి '8 వసంతాలు'
on Feb 14, 2024
తెలుగులో షార్ట్ ఫిల్మ్ అనగానే చాలామందిలో మెదిలే మొదటి పేరు 'మధురం'. పదేళ్ల క్రితం వచ్చిన ఈ షార్ట్ ఫిల్మ్ పేరుకి తగ్గట్టుగానే ఎంతో మధురంగా ఉండి, ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఈ 'మధురం' షార్ట్ ఫిల్మ్ ని రూపొందించిన ఫణీంద్ర నరిశెట్టి.. 'మను'(2018) అనే సినిమాతో దర్శకుడిగా వెండితెరకు పరిచయమయ్యాడు. రిజల్ట్ ని పక్కన పెడితే ఆ సినిమాకి కూడా డైరెక్టర్ గా ఫణీంద్రకి మంచి పేరే వచ్చింది. ఎంతో ప్రతిభగల ఈ యువ దర్శకుడితో ఇప్పుడు ఓ బ్యూటిఫుల్ ఫిల్మ్ చేయడానికి శ్రీకారం చుట్టింది ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్.
ఫణీంద్ర నరిశెట్టి దర్శకత్వంలో ఓ సినిమాని రూపొందిస్తున్నట్లు మైత్రి మూవీ మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ప్రేమికుల రోజు సందర్భంగా ఇవాళ ఈ సినిమాని ప్రకటించడం విశేషం. ఈ చిత్రానికి '8 వసంతాలు' అనే బ్యూటిఫుల్ టైటిల్ పెట్టారు. ఆ టైటిల్ కి తగ్గట్టుగానే అనౌన్స్ మెంట్ పోస్టర్ కూడా ఎంతో అందంగా ఉంది. ఇక పోస్టర్ మీద రాసున్న "365 రోజులని అంకెలతో కొలిస్తే ఒక సంవత్సరం.. అదే అనుభవాలతో కొలిస్తే ఒక వసంతం" అనే లైన్స్ ఆకట్టుకుంటున్నాయి. 8 సంవత్సరాల వ్యవధిలో, ఒక యువతి జీవితంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో సాగే రొమాంటిక్ డ్రామాగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటున్నట్లు మేకర్స్ తెలిపారు. నటీనటులతో పాటు ఈ సినిమాకి సంబంధించిన ఇతర వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు చెప్పారు.
Also Read