ప్రభాస్ `మిర్చి`కి తొమ్మిదేళ్ళు!
on Feb 8, 2022

``కటౌట్ చూసి.. కొన్ని కొన్ని నమ్మేయాలి డూడ్..`` అంటూ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సందడి చేసిన చిత్రం `మిర్చి`. తెలుగునాట వరుస విజయాలతో దూసుకుపోతున్న విజనరీ డైరెక్టర్ కొరటాల శివకి దర్శకుడిగా ఇదే మొదటి సినిమా. ప్రభాస్ ని సరికొత్తగా ఆవిష్కరిస్తూ కొరటాల తెరకెక్కించిన ఈ సినిమా.. అప్పట్లో ప్రభాస్ కి కెరీర్ హయ్యస్ట్ గ్రాసర్ గా నిలవడమే కాకుండా, `ఉత్తమ నటుడు`గా తొలి `నంది`ని అందించింది. ఇందులో ప్రభాస్ కి జంటగా అనుష్క, రిచా గంగోపాధ్యాయ్ ఎంటర్టైన్ చేయగా.. సత్యరాజ్, నదియా, సంపత్ రాజ్, బ్రహ్మానందం, ఆదిత్యా మీనన్, సుబ్బరాజు, నాగినీడు, సత్యం రాజేశ్, సుప్రీత్, రఘుబాబు, ప్రియ, అజయ్, హేమ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. హంసా నందిని టైటిల్ సాంగ్ లో తన చిందులతో కనువిందు చేసింది.
Also Read: 'బిగ్ బాస్' ఫేమ్ 'సరయు' అరెస్ట్!
రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ బాణీలకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యమందించారు. ``ఇదేదో బాగుందే``, ``పండగలా దిగివచ్చావు``, ``మిర్చి మిర్చి``, ``బార్బీ గాళ్``, ``డార్లింగే``, ``నీ చూపుల``, ``యాహూ యాహూ``.. ఇలా ఇందులోని పాటలన్నీ విశేషాదరణ పొందాయి. `ఉత్తమ చిత్రం`, `ఉత్తమ నటుడు`, `ఉత్తమ నూతన దర్శకుడు`, `ఉత్తమ గాయకుడు` (కైలాస్ ఖేర్ - పండగలా), `ఉత్తమ ప్రతినాయకుడు` (సంపత్ రాజ్), `ఉత్తమ కళా దర్శకుడు` (ఏయస్ ప్రకాశ్) విభాగాల్లో `నంది` పురస్కారాలు అందుకున్న `మిర్చి`.. కన్నడంలో `మాణిక్య`, బెంగాలీలో `బిందాస్` పేర్లతో రీమేక్ అయింది. 2013 ఫిబ్రవరి 8న విడుదలై అఖండ విజయం సాధించిన `మిర్చి`.. నేటితో 9 వసంతాలు పూర్తిచేసుకుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



