మ్యూజికల్ హిట్ `కలుసుకోవాలని`కి 20 ఏళ్ళు!
on Feb 8, 2022

రొమాంటిక్ ఎంటర్టైనర్స్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన కథానాయకుల్లో ఉదయ్ కిరణ్ ఒకరు. `చిత్రం`, `నువ్వు నేను`, `మనసంతా నువ్వే` వంటి హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ తరువాత ఉదయ్ హీరోగా నటించిన నాలుగో మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా `కలుసుకోవాలని`. ఆర్. రఘురాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి వక్కంతం వంశీ రచన చేశారు. ఇందులో ఉదయ్ కిరణ్ కి జంటగా గజాలా, ప్రత్యూష నటించగా సత్యనారాయణ, సునీల్, ధర్మవరపు సుబ్రమణ్యం, గిరిబాబు, వైజాగ్ ప్రసాద్, గౌతం రాజు, సుధ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు.
Also Read: వరుస నెలల్లో కాజల్ సందడి!
రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో రూపొందిన పాటలకు `సిరివెన్నెల` సీతారామశాస్త్రి, కులశేఖర్, దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యమందించారు. ``ఉదయించే సూర్యుడిని అడిగా``, ``ఆకాశం తన రెక్కలు విప్పి``, ``చెలియా చెలియా``, ``తళ తళమని``, ``పదే పదే వెంటాడే కల``, ``ఒకే ఒక క్షణం చాలుగా``, ``ప్రియా ప్రియా``, ``షకీలా``.. ఇలా ఇందులోని పాటలన్నీ యువతరాన్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. హైదరాబాద్, విజయవాడ, శ్రీకాకుళం ఇలా మూడు ప్రాంతాలకు చెందిన మూడు కేంద్రాల్లో ఈ సినిమా శతదినోత్సవం జరుపుకుంది. అలాగే తమిళంలో `ఐస్` (2003) పేరుతో రీమేక్ అయింది. 2002 ఫిబ్రవరి 8న విడుదలై మ్యూజికల్ హిట్ గా నిలిచిన `కలుసుకోవాలని`.. నేటితో 20 వసంతాలు పూర్తిచేసుకుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



