ఎన్టీఆర్ `గులేబకావళి కథ`కి 60 వసంతాలు.. విశేషాల మాలిక!
on Jan 5, 2022

నటరత్న నందమూరి తారక రామారావు మంచి నటుడు మాత్రమే కాదు.. మంచి దర్శకుడు కూడా. కథానాయకుడిగా ఎలాగైతే అన్ని జానర్స్ లో విజయాలు చూశారో.. అదే తరహాలో దర్శకుడిగానూ అదే శైలిలో విజయాలు అందుకుని తెలుగునాట సరికొత్త రికార్డు సృష్టించారాయన. అలాంటి ఎన్టీఆర్ తన స్వీయ దర్శకత్వంలో నటించిన రెండో సినిమాగా `గులేబకావళి కథ`(1962)కి ప్రత్యేక స్థానముంది. జానపద చిత్రంగా తెరకెక్కి అఖండ విజయం సాధించిన ఈ సినిమా.. నేటితో (జనవరి 5)తో 60 వసంతాలు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా `గులేబకావళి కథ` తాలూకు కొన్ని ఆసక్తికరమైన విశేషాల్లోకి వెళితే..
విశేషాల మాలికః
* ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం `సీతారామ కళ్యాణం` తరహాలోనే `గులేబకావళి కథ` కూడా సంక్రాంతి సీజన్ లోనే జనం ముందు నిలిచింది. 1961 జనవరి 6న `సీతారామ కళ్యాణం` విడుదల కాగా.. సరిగ్గా ఏడాదికి అంటే 1962 జనవరి 5న `గులేబకావళి కథ` తెరపైకి వచ్చింది. విశేషమేమిటంటే.. ఈ రెండు సినిమాల టైటిల్ కార్డ్స్ లోనూ దర్శకుడి పేరు ఉండదు.
* `గులేబకావళి కథ`తో ప్రముఖ గీత రచయిత డాక్టర్ సి. నారాయణరెడ్డి చిత్ర రంగంలోకి అడుగుపెట్టారు. ఇందులో ఆయన రచించిన పాటలన్ని జనుల్ని రంజింపజేశాయి. మరీముఖ్యంగా.. ``నన్ను దోచుకుందువటే`` గీతమైతే ఇప్పటికీ నిత్యనూతనమే.
* `గులేబకావళి కథ`తోనే సంగీత దర్శకులు జోసెఫ్ - విజయా కృష్ణమూర్తి స్వరంగేట్రం చేశారు. మొదటి సినిమాతోనే అఖండ విజయం సొంతం చేసుకున్నారు.
* ఎన్టీఆర్ రూపొందించిన `సీతారామ కళ్యాణం`తో ఛాయాగ్రాహకుడిగా పరిచయమైన ప్రముఖ సినిమాటోగ్రాఫర్, దర్శకుడు రవికాంత్ నగాయిచ్.. ఈ చిత్రానికి కూడా కెమెరామెన్ గా పనిచేశారు.
* `సీతారామ కళ్యాణం` తరహాలోనే ఈ చిత్రాన్ని కూడా ఎన్టీఆర్ సోదరుడు ఎన్. త్రివిక్రమరావు నిర్మించారు.
* అప్పటికే ఎన్టీఆర్ సరసన పలు విజయవంతమైన చిత్రాల్లో అలరించిన అందాల నటి జమున.. ఈ సినిమా కోసమే తొలిసారిగా నటరత్న దర్శకత్వంలో నటించారు. ఆపై `అక్బర్ సలీమ్ అనార్కలి`(1978) కోసం మరోసారి ఎన్టీఆర్ డైరెక్షన్ లో ఆయనకి జోడీగా ఆకట్టుకున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



