పడి పడి లేచే హీరో శర్వానంద్!!
on Mar 6, 2019
`సంక్రాంతి` వెలుగు`తో తన `గమ్యం` ముద్దాడి `ప్రస్థానం` తో తన నట ప్రస్థానం కొనసాగిస్తూ అప్పటి నుంచి `రన్ రాజా రన్` అంటూ వరుస సినిమాలతో రన్నింగ్ చేస్తూ `మళ్లీ మళ్లీ ఇది రాని రోజు` వెనక్కి మళ్లి చూడకుండా ఎక్స్ ప్రెస్ రాజాలా దూసుకెళ్తూ అందరూ `శతమానం భవతి` అని అందరి చేత దీవెనలు అందుకున్న `మహానుభావుడు` హీరో శర్వానంద్. తన కెరీర్ `పడి పడి లేచే మనసు` పడుతూ లేస్తోన్నా కానీ, ఎక్కడ అధైర్య పడకుండా సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాడు శర్వానంద్. ప్రజంట్ దిల్ రాజు బేనర్ లో 96 చిత్రానికి రీమేక్ లో సమంతతో కలిసి నటిస్తున్నాడీ యంగ్ హీరో.
అమ్మ చెప్పిందితో మానసికంగా ఎదగని పాత్రలో నటించి నటుడుగా ఎంతో ఎదగాడు అనిపించుకున్నాడు. ఇక గమ్యం చిత్రంలో తనను తాను తెలుసుకునే కుర్రాడి పాత్రలో తనేంటో తెలుసుకున్నాడు. ఇక ప్రస్థానం సినిమా తన తెలుగు ఇండస్ట్రీలో తనకో స్థానాన్ని ఏర్పరిచింది. ఆ తర్వాత చేసిన కొన్ని సినిమాలు వరుసగా ప్లాఫ్ అవడంతో కొంత నిరాశ పడ్డాడు. కో అంటే కోటి అంటూ నిర్మాతగా మారి కోట్లు పోగొట్టుకున్నాడు. అంతటితో నిర్మాతగా ఇక లైఫ్ లో చేయవద్దనుకున్నాడు. రన్ రాజా రన్ తో పూర్తిగా తన మేకోవర్ మార్చుకుని కొత్త శర్వాని ప్రజంట్ చేసుకున్నాడు. ఆ సినిమాలో శర్వానంద్ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. శర్వానంద్ ఇలా కూడా నటిస్తాడా అని అందరూ అనుకున్నారు.ఆ సినిమాతో మంచి పేరు వచ్చింది. ఇక మళ్లీ మళ్లీ రానిరోజులో మంచి పాత్ర దక్కింది. ప్రస్తుతం శర్వానంద్ యంగ్ హీరోస్ లో మోస్ట్ వాంటెడ్ హీరోగా మారిపోయాడు. సినిమా సినిమాకు తనను తాను తీర్చిదిద్దుకుంటూ విభిన్నమైన సినిమాలు ఒప్పుకుంటూ వెళ్తున్నాడు. కూల్ గా సినిమాలు చేసుకుంటూ ఎటువంటి కాంట్రవర్సీలకు వెళ్లని హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఇలాగే ఎక్స్ ప్రెస్ రాజా లా శర్వా కెరీర్ దూసుకెళ్లాలని కోరుకుంటూ ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటోన్న సందర్భంగా హ్యాపీ బర్త్ డే తెలుపుతోంది తెలుగు వన్.