100లవ్ తో 180 థియేటర్ ట్రైలర్
on May 3, 2011
"100% లవ్" ప్రింట్ తో పాటు "180" చిత్రం యొక్క థియేటర్ ట్రైలర్ ను కూడా పంపిస్తున్నారట. వివరాల్లోకి వెళితే నాగచైతన్య "100% లవ్" థియేటర్ల లిస్ట్ ఇలా ఉంది. వివరాల్లోకి వెళితే గీతా ఆర్ట్స్ పతాకంపై, నాగచైతన్య హీరోగా, మిల్కీవైట్ బ్యూటీ తమన్నాభాటియా హీరోయిన్ గా, తార అలీషా రెండవ హీరోయిన్ గా, లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో, బన్నీ వాసు నిర్మించిన విభిన్న ప్రేమకథా చిత్రం "100% లవ్". నాగచైతన్య హీరోగా నటిస్తున్న "100% లవ్" చిత్రం మే 6 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.
నాగచైతన్య హీరోగా నటిస్తున్న "100% లవ్" చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ అందించిన ఆడియో ఇటీవలే ట్రిపుల్ ప్లాటినమ్ డిస్క్ ను సాధించింది.అయితే ఈ చిత్రం ప్రింట్ తో పాటు సిద్ధార్థ హీరోగా, నిత్యామీనన్, ప్రియా ఆనంద్ హీరోయిన్లుగా, జయేంద్ర దర్శకత్వంలో నిర్మించబడుతున్న "180" చిత్రం యొక్క ట్రైలర్ ను కూడా పంపిస్తున్నారట.ఈ విషయంగా గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ తో "180" చిత్రం యూనిట్ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుందట. "180" చిత్రానికి శరత్ సంగీతాన్ని అందించారు. ఈ "180" సినిమా రానున్న వేసవిలో విడుదల కాబోతూంది.