రెండు వారాలకో కోలీవుడ్ టాప్ స్టార్ సందడి!
on Feb 9, 2022

చియాన్ విక్రమ్, అజిత్, సూర్య.. ఇలా కోలీవుడ్ కి చెందిన టాప్ స్టార్స్ వరుసగా సినిమాలతో సందడి చేయనున్నారు. ఓటీటీ, థియేటర్స్.. ఇలా వేదిక ఏదైనా రెండు వారాలకో కోలీవుడ్ టాప్ స్టార్.. కొత్త చిత్రాలతో వినోదాలు పంచేందుకు సిద్ధమయ్యారు.
Also Read: రామ్ కంటే బోయపాటికే ఎక్కువ పారితోషికం!?
ఆ వివరాల్లోకి వెళితే.. చియాన్ విక్రమ్ నటించిన `మహాన్` ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ లో ఎంటర్టైన్ చేయనుంది. తన తనయుడు ధ్రువ్ విక్రమ్ తో కలిసి విక్రమ్ నటించిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఈ నెల 10న స్ట్రీమ్ కానుంది. కార్తిక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో విక్రమ్ జోడీగా సిమ్రాన్ కనిపించనుంది. ఇక `మహాన్` విడుదలైన రెండు వారాల తరువాత అంటే ఫిబ్రవరి 24న మరో కోలీవుడ్ టాప్ స్టార్ అజిత్ నటించిన `వలిమై` థియేటర్స్ లో రిలీజ్ కానుంది. `ఖాకీ` ఫేమ్ హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో `ఆర్ ఎక్స్ 100` ఫేమ్ కార్తికేయ విలన్ గా దర్శనమివ్వనుండగా.. హ్యూమా ఖురేషి నాయికగా నటించింది.
Also Read: వరుస నెలల్లో కాజల్ సందడి!
ఇక `వలిమై` రిలీజైన రెండు వారాలకి ఇంకో కోలీవుడ్ అగ్ర కథానాయకుడు సూర్య నటించిన `ఎదర్కుమ్ తుణిందవన్` విడుదల కానుంది. పాండిరాజ్ రూపొందించిన ఈ సినిమాలో సూర్య కి జోడీగా ప్రియాంక అరుళ్ మోహన్ కనిపించనుంది. మార్చి 10న `ఈటీ` థియేటర్స్ లో సందడి చేయనుంది.
మరి.. తెలుగులోనూ అనువాదం కానున్న ఈ మూడు సినిమాలు.. ఆయా స్టార్స్ కి ఎలాంటి ఫలితాలను అందిస్తాయో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



