పదహారేళ్ళ ప్రాయంలో `దేవదాసు`!
on Jan 11, 2022

తెలుగునాట సంక్రాంతి విజయాలు ఎన్నో ఉన్నాయి. అయితే, ఓ నూతన జంటతో పొంగల్ బ్లాక్ బస్టర్ కొట్టడం మాత్రం అరుదైన అంశమనే చెప్పాలి. అలాంటి రేర్ రికార్డ్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన సినిమా `దేవదాసు`. మ్యూజికల్ హిట్స్ కి చిరునామాగా నిలిచిన టాలెంటెడ్ డైరెక్టర్ వైవీఎస్ చౌదరి.. తనే స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహించిన ఈ చిత్రంతో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, స్టార్ బ్యూటీ ఇలియానా తెలుగు తెరకు నాయకానాయికలుగా పరిచయమయ్యారు. ఇద్దరికీ ఇదే మొదటి సినిమా అయినా.. ఎక్కడా ఆ భావన కలిగించకుండా తమ అభినయంతో సినిమాకి ఎస్సెట్ గా నిలిచారు. బస్తీ కుర్రాడు దేవదాసు, ఎన్నారై అమ్మాయి భానుమతి పాత్రల్లో రామ్, ఇలియానా పోటీపడి మరీ నటించి `దేవదాసు` ఘనవిజయంలో భాగమయ్యారు. ఇద్దరు కూడా `బెస్ట్ డెబ్యూ` విభాగంలో `ఫిల్మ్ ఫేర్` సొంతం చేసుకున్నారు. ఆపై అనతికాలంలోనే టాలీవుడ్ లో స్టార్స్ గా నిలిచారు.
Also Read: నాగ్ కి `మజ్ను`.. చైతూకి `బంగార్రాజు`..!
అందాల తార శ్రియ ఓ ప్రత్యేక గీతంలో కనువిందు చేసిన ఈ సినిమాలో సాయాజీ షిండే, విద్య, రమాప్రభ, వేణు మాధవ్, ఎమ్మెస్ నారాయణ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించగా వైవీఎస్ చౌదరి, చక్రి అతిథి పాత్రల్లో దర్శనమిచ్చారు. ``అడిగీ అడగలేక``, ``ఓ నేస్తం కావాలి``, ``బంగారం``, ``క్షమించు``, ``నువ్వంటేనే ఇష్టం``, ``గుండెల్ని పిండేది``, ``తెలుసా``, ``కుర్రాళ్ళు``, ``మాయదారి సిన్నోడు`` (రీమిక్స్), ``ఏయ్ బాబు``.. ఇలా చక్రి స్వరకల్పనలో రూపొందిన గీతాలన్నీ కూడా చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. 2006 జనవరి 11న సంక్రాంతి కానుకగా విడుదలై మ్యూజికల్ సెన్సేషన్ గా నిలిచిన `దేవదాసు`.. నేటితో పదహారు వసంతాలు పూర్తిచేసుకుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



