మిస్ యు అంటున్న సిద్దార్ధ్.. లవ్ మ్యారేజ్ మనకి కలిసి రాదా!
on Nov 12, 2024
బాయ్స్,బొమ్మరిల్లు, ఓయ్, కొంచం ఇష్టం కొంచం కష్టం.ఓ మై ఫ్రెండ్ వంటి హిట్ చిత్రాలతో తెలుగు సినిమా ప్రేక్షకుల హృదయాలో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్న హీరో సిద్దార్ధ్(siddharth) రీసెంట్ గా ప్రముఖ హీరోయిన్ అదితి రావు హైదరి ని వివాహం చేసుకున్న సిద్దార్ధ్ చాలా సంవత్సరాల తర్వాత 'చిన్న' అనే మూవీతో వచ్చి హిట్ ని కూడా అందుకున్నాడు.
సిద్దార్ధ్ ప్రస్తుతం తమిళంలో 'మిస్ యు'(miss you)అనే సినిమా చేస్తున్నాడు.ఈ మూవీ టీజర్ ని రీసెంట్ గా మక్కల్ సెల్వం విజయ్ సేతుపతి(vijay sethupati)తన చేతుల మీదుగా టీజర్ రిలీజ్ అయ్యింది. నాగార్జున(nagarjuna)తో నా సామి రంగ లో కలిసి జోడి కట్టిన ఆషిక రంగనాద్ హీరోయిన్ గా చేస్తుంది.ఇక టీజర్ చూస్తున్నంత సేపు కూడా ఎంతో ఫ్రెష్ లుక్ లో ఉండటంతో పాటుగా కంప్లీట్లీ లవ్ స్టోరీ గా తెరకెక్కబోతుందని తెలుస్తుంది. డైలుగులు కూడా చాలా బాగున్నాయి.లవ్ మారైజ్ మనకి కలిసి రావని ఒక వ్యక్తి సిద్దార్ధ్ తో చెప్పడం సినిమా మీద క్యూరియాసిటీ ని కలగ చేస్తుంది.
రాజశేఖర్(rajasekhar)దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'మిస్ యు' సినిమాని రెడ్ జైంట్ మూవీస్ అండ్ సెవెన్ మైల్స్ పర్ సెకండ్ లు నిర్మిస్తుండగా జిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. నవంబర్ 29 న తమిళ నాట రిలీజ్ కాబోతున్న ఈ మూవీ తెలుగులోకి కూడా డబ్ అయ్యే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి.
Also Read