పవన్ కళ్యాణ్ చేతిలో కంజర..ఇక హరిహరవీరమల్లు ఫస్ట్ సాంగ్ రిలీజ్
on Jan 4, 2025
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan)అప్ కమింగ్ మూవీ 'హరిహరవీరమల్లు(hariharaveeramallu).పోరాట యోధుడు గా పవన్ తన ఎంటైర్ కెరీర్లోనే ఫస్ట్ టైం చేస్తున్నచారిత్రాత్మక మూవీ కావడంతో వీరమల్లుపై పవన్ అభిమానుల్లోనే కాకుండా ప్రేక్షకుల్లోను భారీ అంచనాలు ఉన్నాయి.ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలు,టీజర్ కూడా హై రేంజ్ లోనే ఉన్నాయి.
ఇప్పుడు ఈ మూవీ నుంచి 'మాట వినాలి'(Maata Vinaali)అనే లిరిక్ తో కూడిన సాంగ్ ఈ నెల 6 న విడుదల కాబోతుంది. ఈ మేరకు మేకర్స్ అధికారకంగా ఒక పోస్టర్ ని రిలీజ్ చేసారు.
నిండు పున్నమి లో చలి మంట మధ్య చేతిలో 'కంజర' దరువేస్తు ఉన్న పవన్ స్టిల్ ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంటుంది.ఈ పాటకి ఉన్న ఇంకో ప్రత్యేకత ఏంటంటే పవన్ స్వయంగా ఈ పాటని పాడాడు.గతంలో కూడా పవన్ కొన్ని సినిమాల్లో పాటలు పాడి తన అభిమానులని,ప్రేక్షకులని ఎంతగానో అలరించిన విషయం తెలిసిందే. దీంతో ఈ సాంగ్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. 'వీరమల్లు' నుంచి రిలీజ్ అవుతున్న తొలి సాంగ్ కూడా ఇదే.
శ్రీ సూర్య మూవీస్ పతాకంపై ఎఏం రత్నం(Am Rathnam)నిర్మిస్తున్న వీరమల్లులో పవన్ సరసన నిది అగర్వాల్(Nidhhi Agerwal)హీరోయిన్ గా చేస్తుంది.నోరా ఫతేహి,బాబీడియోల్,సునీల్ జిష్హుసేన్ గుప్తా,రఘుబాబు,పూజిత పొన్నాడ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్నారు.జ్యోతికృష్ణ(Jyothi Krishna)దర్శకుడు కాగా రెండు పార్టులుగా మూవీ తెరకెక్కనుంది.మొదటి భాగం మార్చి 28 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతాన్నిఅందించాడు.