నాంపల్లి కోర్టుకి అల్లుఅర్జున్
on Jan 4, 2025
డిసెంబర్ 4 న పుష్ప 2(Pushpa 2)బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయిన కేసులో మధ్యంతర బెయిల్ తో బయట ఉన్న అల్లు అర్జున్ కి రీసెంట్ గా నాంపల్లి కోర్టు 50 వేల రూపాయలు,ఇద్దరి సాక్ష్య సంతకాలతో రెగ్యులర్ బెయిల్ ని ఇస్తూ తీర్పుని ప్రకటించిన విషయం తెలిసిందే.
దీంతో అల్లు అర్జున్(Allu arjun)ఈ రోజు నాంపల్లి కోర్టు కు వెళ్లి బెయిల్ కు సంబంధించిన పూచీకత్తు పత్రాలు సమర్పించవలసి ఉంది.ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకి వచ్చి తన ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసారు.ఆ సమయంలో అల్లు అర్జున్ వెంట బన్నీ వాస్ కూడా ఉన్నాడు.ఇక అల్లు అర్జున్ రాకతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు.ఇక అల్లు అర్జున్ కి రెగ్యులర్ బెయిల్ అంశం పెద్ద ఊరటని చెప్పవచ్చు.కాకపోతే ప్రతి ఆదివారము చిక్కడపల్లి పోలీసుల ముందు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటు కూడా కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది.సాక్షులను ప్రభావితం చెయ్యడం గాని,కేసుని ప్రభావితం చేసే విధంగా బహిరంగంగా మాట్లాడటం కానీ చేయవద్దని కూడా న్యాయస్థానం తన తీర్పులో వెల్లడి చెయ్యడం జరిగింది.
Also Read