ప్రముఖ నటుడు కాదంబరి కిరణ్ కుమార్తె పూర్ణ సాయి శ్రీ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. బుధవారం ఉదయం హైదరాబాద్ లోని ఓ ప్రముఖ ఫంక్షన్ హాల్ లో జరిగిన ఈ వివాహ మహోత్సవానికి సినిమా, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు తలసాని శ్రీనివాస యాదవ్, సి.బి.ఐ. మాజీ జాయింట్ డైరక్టర్ జె.డి.లక్ష్మీనారాయణ, సినీ ప్రముఖులు మురళి మోహన్, శ్రీకాంత్, కోట శ్రీనివాసరావు, రామజోగయ్య శాస్త్రి, తనికెళ్ల భరణి, భాస్కరభట్ల, సాయికుమార్, అలీ, దర్శకులు రేలంగి నరసింహారావు, అల్లాణి శ్రీధర్, నిర్మాతలు బండ్ల గణేష్, అశోక్ కుమార్, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ తదితరులు హాజరయ్యారు.
కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న కాదంబరి కిరణ్.. 'మనం సైతం' ద్వారా సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటారు.