అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న ఐదో చిత్రం ఏజెంట్. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం స్పై థ్రిల్లర్ మూవీగా తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం అఖిల్ హాలీవుడ్ హీరోల రేంజిలో హాలీవుడ్ యాక్షన్ హీరోల లుక్ లోకి మారిపోయారు. కండలు తిరిగిన శరీరంతో కనిపిస్తున్నారు. ఇందులో అఖిల్ సీక్రెట్ ఏజెంట్‌గా కనిపించనున్నారు. ఈ టీజర్ ఎప్పుడో ప్రేక్షకులకు ముందు వచ్చింది. మంచి స్పందన తెచ్చుకుని అందరినీ ఆకట్టుకుంది. ఈ చిత్రం చూడాలనే ఇంప్రెషన్ ని కలుగజేసింది. కానీ దానిని నిలబెట్టుకోవడంలో యూనిట్ విఫలమైంది. సైరా నరసింహారెడ్డి తర్వాత సురేందర్ రెడ్డి తీస్తున్న చిత్రం ఇది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ తో పాటు సురేందర్ రెడ్డి కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామి. ఈ చిత్రానికి దాదాపు 80 కోట్ల బడ్జెట్ను ఖర్చు పెట్టారు. ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కీలకపాత్ర నటిస్తున్నారు. అలాగే సాక్షి వైద్య ఈ మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది.
ఈ సినిమాను ఏప్రిల్ 14న విడుదల చేసేందుకు డేట్ ఫిక్స్ చేశారు. మరో రెండు నెలల సమయం మాత్రమే ఉంది. అయినా ఈ సినిమాపై అలాంటి బజ్ లేదు. పాన్ ఇండియా సినిమా అన్న తర్వాత రెండు మూడు నెలల నుంచి ప్రేక్షకులలో బజ్ క్రియేట్ చేయాలి. వరుస అప్డేట్స్ తో ఆ చిత్రం గురించి అందరూ మాట్లాడుకునేలా చేయాలి. తమ కంటెంట్‌తో ప్రేక్షకులకు రీచ్ అవుతూ ఉండాలి. మీడియాలో ఏజెంట్ మూవీ గురించి ఎక్కువ చర్చ జరిగేలా చేయాలి. బాలీవుడ్ లో పఠాన్ మూవీ ఈ పనిని చేయగలిగింది కాబట్టే నెగటివ్ ప్రచారం ఉన్న సరే ఈ సినిమా సూపర్ టాక్ కలెక్షన్స్ తో దూసుకొని పోతోంది. దీనికి మరో ఉదాహరణ ధమాకా. ఈ చిత్రం కూడా మిక్స్డ్ టాక్ వచ్చినా ఏకంగా 100 కోట్ల క్లబ్ లో చేరింది అంటే అది ప్రమోషన్స్ పుణ్యమేనని చెప్పాలి. అటు సురేందర్ రెడ్డి కి ఇటు అఖిల్ కి ఏజెంట్ మూవీ కచ్చితంగా బ్లాక్ బస్టర్ కావాలి. వారిది డూ ఆర్ డై సిట్యుయేషన్. అయినా యూనిట్ మాత్రం ఎలాంటి అప్డేట్స్ లేకుండా ప్రమోషన్స్ చేయడం లేదు.
అప్పుడప్పుడు అఖిల్ తనదైన ఫోటోలతో హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది టాలీవుడ్ కే పరిమితం అవుతుంది. పాన్ ఇండియా లెవెల్లో బజ్ క్రియేట్ అయి ఓపెనింగ్స్ రావాలంటే ఈ రెండు నెలల సమయాన్ని వీలైనంత వరకు సినిమాను మార్కెట్లోకి తీసుకుని వెళ్లాలి. మరి దీనిపై సురేందర్ రెడ్డి ఎలా ముందుకు వెళ్తాడు? ఆయన మార్కెటింగ్ స్ట్రాటర్జీ ఎలా ఉంది? ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా చేయడంలో ఆయన ఆలోచన ఏమిటి? అన్న దానిపై ఈ చిత్రం జయాపజయాలు ఆధారపడి ఉన్నాయని చెప్పవచ్చు.