మన స్టార్ హీరోలు అందరూ ఒకరితో ఒకరు ఎంతో క్లోజ్ గా ఉంటారు. నిన్నటి తరం సంగతి పక్కన పెడితే నేటి తరం యంగ్ స్టార్స్ అందరూ వృత్తిపరంగా పోటీ పడుతుంటారే గాని వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా క్లోజ్ ఫ్రెండ్స్. వారు బాగానే ఉన్నా వారి అభిమానుల పరిస్థితి మరి దారుణంగా మారుతుంది. ఆర్ఆర్ ఆర్ చిత్రాన్ని ఎంతో అభిమానంతో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు కలిసి చేస్తే ఈ చిత్రం టైటిల్ రిలీజ్ దగ్గర నుంచి వారి అభిమానులు మాత్రం ఒకరిపై ఒకరి యుద్ధానికి దిగారు. ట్రైలర్లో మా హీరోకు ప్రాధాన్యత లేదంటే ఒకరు తమ హీరోని సరిగా చూపించలేదని మరికొందరు చివరకు రాజమౌళి పై నిప్పులు చెరిగారు.
ఒకరి హీరోతో ఒకరిని పోల్చుకుంటూ చివరికి రాజమౌళిని టార్గెట్ చేశారు. ఇప్పుడు ఇదే తీరా చూస్తే ఏకంగా ఆస్కార్ వరకు వెళ్లి మన విజయ కేతనాన్ని ఎగురవేసే దిశగా సాగుతోంది. ప్రస్తుతం వంతు ప్రభాస్- మహేష్ బాబు అభిమానులకు వరకు వచ్చింది. గత కొంతకాలంగా సోషల్ మీడియా వరకే పరిమితమైన ఫ్యాన్స్ వార్ ఇప్పుడు హద్దులు దాటేసి రోడ్డు ఎక్కుతోంది. వీధి పోరాటాలు, పోలీస్ స్టేషన్లు దాకా దారితీస్తుంది. ప్రభాస్ మహేష్ ఫ్యాన్స్ వార్ మొదలైంది. ఒకరిని ఒకరు రెచ్చగొట్టుకుంటూ పోస్టులు పెడుతున్నారు. అంతటితో ఆగక ఇద్దరు హీరోల ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేస్తూ బహిరంగ యుద్దానికి దిగుతూ సవాలు విసురుతున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ గాజులు చూపిస్తూ మహేష్ అభిమానుల్ని రెచ్చగొడుతున్నారు. ఇలా గాజులు చీరల వరకు వ్యవహారం వచ్చింది. ఇదంతా బెంగుళూరులో జరిగింది. అది హైదరాబాద్ వరకు వచ్చింది. ఇద్దరు హీరోల అభిమానుల చిల్లరి పనులు అల్లరి చేష్టలు చూసిన వారంతా ఇదేం పోయే కాలం అంటున్నారు.
పని పాట లేని వాళ్ళు చేసే పనులుగా హీరోల పరువు తీస్తున్నారంటూ మండిపడుతున్నారు. హీరోలు ఫ్రెండ్స్ గా వ్యవహరిస్తూ ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటే వారి ఫాన్స్ మాత్రం ఇలా సోషల్ మీడియా వేదికగా వీధి రౌడీలా వ్యవహరిస్తున్న తీరు ఏమీ బాగాలేదని మరి కొంతమంది ఫ్యాన్స్ పై కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా తమ అభిమానులను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఆయా హీరోల మీద మాత్రమే ఉందని కచ్చితంగా చెప్పాలి. వారి మాట వినకపోతే ఇక ఫ్యాన్స్ ఎవరి మాట వింటారు అనేది ప్రశ్నార్ధకంగా మారింది.