ప్రస్తుతం ఓ ఫోటో మరియు వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఓ లగ్జరీ కారులో మారుతి స్టైలిష్ గా కూర్చొని ఫోజ్ ఇచ్చారు. ఆ కారు మరెవరితో కాదు ప్రభాస్ దే. ఆయన ఎంతో ఇష్టంతో కనుగోలు చేసిన లంబోర్గిని. అందులోనే మారుతి కూర్చొని ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. అది చూసిన అభిమానులు ఈ ఫోటోకు తెగ లైక్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు. అదిరిపోయింది సూపర్ అంటూ ట్రెండ్ చేస్తున్నారు. ప్రభాస్ తో సినిమా గురించి అప్డేట్స్ ఇవ్వమని కోరుతున్నారు. ప్రభాస్ తో మారుతి చేయబోయే సినిమా హర్రర్ కామెడీ నేపథ్యంలో రూపొందుతోంది. ఇందులో ప్రభాస్ స్టైలిష్ గా కనిపించబోతున్నారు. ఆయనకు తాతగా బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కనిపించనున్నట్టు సమాచారం.
రాజా డీలక్స్ అనే ప్రచార టైటిల్ తో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రానికి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా లేదు. ఇలా చేయడం మారుతికి మాత్రమే సాధ్యమని భావించాలి. హైదరాబాదులో వేసిన ఇంటి సెట్‌లో ప్రధాన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఇందులో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ ఇందులో హీరోయిన్లు. తెలుగు ఇండస్ట్రీలో చాలామందికి కారు మోజు ఉన్న సంగతి తెలిసిందే. మార్కెట్లోకి ఏ కొత్త కారు వచ్చినా వెంటనే కొనేసుకుంటారు. వాటిని తమ గేరేజీలో పెట్టుకుంటారు. అందులో ప్రభాస్ ఒకరు. అందులో ఆయన పాన్ ఇండియా స్టార్. ముఖ్యంగా ఇండియాలో హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకునే స్టార్లలో ఆయన ఒకరు. ఈయన ఓ సినిమాకు 100 కోట్లకు పైగా పారితోషం తీసుకుంటారని ప్రచారం ఉంది. మొత్తానికి ప్రభాస్ నే కాదు ప్రభాస్ కారుని కూడా ఇలా బాగా వాడేస్తున్నాడు మారుతి.