కార్తికి తెలుగులో ఎన్ని సినిమాలు వచ్చినా, ఆవారా తెచ్చిపెట్టిన గుర్తింపుకు ఏదీ సాటిరాదు. పైయా పేరుతో తమిళంలో తెరకెక్కింది ఈ సినిమా. కార్తి, తమన్నా జంట, చెన్నై టు ముంబై కారులో ట్రావెల్, అరెరే వానా జడివానా అంటూ మండు వేసవిలోనూ చల్లటి జల్లులను గుర్తుచేసే పాటలు సినిమాకు హైలైట్ అయ్యాయి. లింగుస్వామి టేకింగ్‌లో యాక్షన్ ఎపిసోడ్స్ ఇంకే రేంజ్‌లో గుర్తింపు పొందాయి. ఇప్పుడు ఆవారా సినిమాకు సీక్వెల్ తెరకెక్కించే పనిలో ఉన్నారు లింగుస్వామి అండ్ టీమ్.గతేడాది రామ్‌ని హీరోగా తమిళ్‌కి పరిచయం చేస్తూ వారియర్ అనే సినిమా చేశారు లింగుస్వామి. ఓ డాక్టర్‌కి కోపం వచ్చి ఐపీయస్ ఆఫీసర్‌గా మారి, రాయలసీమలో ఉన్న రౌడీలను ఏరిపారేసే కథతో తెరకెక్కింది. అయితే ఈ సినిమా జనాలకు నచ్చలేదు. అట్టర్‌ఫ్లాప్ అయింది.ఇప్పుడు ఆవారాకి సీక్వెల్ తయారు చేసే పనిలో ఉన్నారు లింగుస్వామి.
ఈ సీక్వెల్‌లో హీరోగా కార్తికి బదులు, ఆర్యని కథానాయకుడిగా అనుకుంటున్నారట లింగుస్వామి. ఆల్రెడీ ఆర్యకి కథ కూడా వినిపించారట. కథ నచ్చి, తాను సినిమా చేయడానికి రెడీ అనే సిగ్నల్స్ ఇచ్చారట ఆర్య. దుబాయ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. నాయికగా జాన్వీకపూర్‌ని ఫిక్స్ చేయాలని భావిస్తున్నారు.ఆల్రెడీ ఆర్య, లింగుస్వామి కాంబినేషన్‌లో వేట్టై అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమా సక్సెస్ కావడంతో లింగుస్వామి టేకింగ్ మీద మంచి నమ్మకం ఉంది ఆర్యకి. ఇప్పుడు అదే నమ్మకంతోనే ఆవారా సీక్వెల్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు హీరో. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అఫిషియల్ న్యూస్ రిలీజ్ కానుంది.కాకపోతే కార్తిలేని ఆవారా సీక్వెల్‌ని జనాలు ఎలా రిజీవ్ చేసుకుంటారనేది అందరి మనస్సులనూ తొలుస్తున్న ప్రశ్న.