వెర్సటైల్ హీరో ధనుష్ టైటిల్ రోల్ లో నటించిన `కర్ణన్` చిత్రంతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కేరళకుట్టి రజీషా విజయన్. ద్రౌపది పాత్రలో తన చలాకీ నటనతో ఆకట్టుకుంది ఈ టాలెంటెడ్ యాక్ట్రస్. తమిళంలో తనకదే తొలి సినిమా అయినప్పటికీ.. అప్పటికే ఏడు మలయాళ చిత్రాల్లో నటించి అవార్డులు సైతం సొంతం చేసుకున్న అనుభవం ఉంది రజీషాకి.
ఇదిలా ఉంటే.. `కర్ణన్` తరువాత కోలీవుడ్ బ్రదర్స్ సూర్య, కార్తి చిత్రాల్లో నటిస్తూ వార్తల్లో నిలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే.. సూర్య కథానాయకుడిగా `కూటత్తిల్ ఒరువన్` ఫేమ్ టీజే జ్ఞానవేల్ ఓ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో సూర్య న్యాయవాది పాత్రలో నటిస్తుండగా.. అతనికి జంటగా రజీషా విజయన్ నటిస్తోంది.
అలాగే, సూర్య తమ్ముడు కార్తి సరసన కూడా రజీషా ఓ సినిమా చేస్తోంది. ఆ చిత్రమే.. `సర్దార్`. `అభిమన్యుడు` ఫేమ్ పి.ఎస్. మిత్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కార్తి ద్విపాత్రాభినయం చేస్తుండగా.. అతని సరసన రాశీ ఖన్నా, రజీషా విజయన్ నటిస్తున్నారు.
మొత్తమ్మీద.. కోలీవుడ్ బ్రదర్స్ సూర్య, కార్తితో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ.. తమిళనాట హాట్ టాపిక్ గా మారింది రజీషా విజయన్.