![]() |
![]() |

నూతన దర్శకుడు యస్.యస్. పట్నాయక్ రూపొందిస్తోన్న థ్రిల్లర్ 'పద్మశ్రీ'. యస్.యస్. పిక్చర్స్ బ్యానర్‌పై సదాశివుని శిరీష ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ లోగోను బుధవారం సాయంత్రం డిజిటల్ మీడియా సంస్థ తెలుగువన్ కార్యాలయంలో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కంఠంనేని రవిశంకర్ ఆవిష్కరించారు. 'పద్మశ్రీ' చిత్రం విజయం సాధించాలనీ, డైరెక్టర్‌గా పట్నాయక్‌కు మంచి పేరు తీసుకురావాలనీ ఆయన ఆకాంక్షించారు.
డైరెక్టర్ యస్.యస్. పట్నాయక్ మాట్లాడుతూ "తెలుగువన్‌లోనే నేను ప్రోగ్రామ్ డైరెక్టర్‌గా పురుడు పోసుకున్నాను. ఆ తర్వాత ప్రోగ్రామ్ హెడ్‌గా నన్ను ప్రమోట్ చేశారు. కొన్నాళ్లు ఇక్కడే పనిచేసి, వేరే చానళ్లకు వెళ్లినప్పటికీ ఇక్కడ నేర్చుకున్న పనే నాకు పనికొచ్చింది. ఆ నేర్చుకున్న పనితోటే ఇప్పుడు 'పద్మశ్రీ'తో డైరెక్టర్‌గా మారాను. తెలుగువన్‌ను నేను యూనివర్సిటీ అంటాను. ఇందులో నేనూ ఓ విద్యార్థిని. ఈ రోజు రవిశంకర్ గారిచేత 'పద్మశ్రీ' టైటిల్ లోగోను లాంచ్ చేయించడం చాలా ఆనందంగా ఉంది" అన్నారు.
పీవీఎస్ రామ్మోహన్ మూవీస్ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోన్న ఈ చిత్రానికి పీవీఎస్ రామ్మోహనరావు, మామిడి సాంబమూర్తి, కొత్తకోట బాలకృష్ణ సహ నిర్మాతలు.

సాంకేతిక బృందం:
రచన-దర్శకత్వం: యస్.యస్. పట్నాయక్
నిర్మాత: సదాశివుని శిరీష
బ్యానర్: యస్.యస్. పిక్చర్స్
సహ నిర్మాతలు: పీవీఎస్ రామ్మోహనరావు, మామిడి సాంబమూర్తి, కొత్తకోట బాలకృష్ణ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పి.వి.జి. కృష్ణంరాజు
సినిమాటోగ్రఫీ: ఎం. నర్సింగరావు
ఎడిటింగ్: కంబాల శ్రీనివాస్
మ్యూజిక్: జాన్
ఫైట్స్: దేవరాజ్
ఆర్ట్: మణిపాత్రుని
సాహిత్యం: బాసంగి సురేశ్, డి. గోవిందరావు, మెండెం శ్రీధర్
![]() |
![]() |