![]() |
![]() |

2001 సంక్రాంతికి సందడి చేసిన భారీ బడ్జెట్ మూవీ.. 'దేవీపుత్రుడు'. సోషియో డ్రామాగా తెరకెక్కిన ఈ విజువల్ వండర్ లో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించగా ఎమ్మెస్ రాజు నిర్మాణంలో శతాధిక చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ రూపొందించారు. ఈ ముగ్గురి కాంబినేషన్ లో ఇది రెండో సినిమా.
ఈ త్రయం కలసి పనిచేసిన మొదటి సినిమా 'శత్రువు'. 1991లో విడుదలైన ఈ క్రైమ్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. వెంకీ - కోడి రామకృష్ణ - ఎమ్మెస్ రాజు.. ఈ ముగ్గురి కాంబినేషన్ లో వచ్చిన ఈ రెండు సినిమాలు కూడా పదేళ్ళ గ్యాప్ లో సంక్రాంతి సీజన్ నే టార్గెట్ చేసుకున్నాయి.
1991 జనవరి 2న 'శత్రువు' చిత్రం సంక్రాంతి కానుకగా జనం ముందుకు రాగా.. 2001 జనవరి 14న 'దేవీపుత్రుడు' చిత్రం పొంగల్ బరిలో దిగింది. ఈ రెండు సందర్భాల్లోనూ మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాలు సందడి చేయడం విశేషం. 1991 జనవరి 9న 'స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్' రిలీజ్ కాగా.. 2001 జనవరి 11న 'మృగరాజు' రిలీజైంది.
![]() |
![]() |