![]() |
![]() |

ఇటీవల కాలంలో తెలుగునాట బోలెడు బోల్డ్ కంటెంట్ మూవీస్ వచ్చాయి. అయితే.. వాటిలో అతి కొద్ది చిత్రాలు మాత్రమే విజయపథంలో పయనించాయి. ఎందుకంటే.. కేవలం బోల్డ్ కంటెంట్ తో ఏ సినిమా కూడా బాక్సాఫీస్ ని షేక్ చేసేయదు. సాలిడ్ ఎమోషన్ తోడైతేనే బాక్సాఫీస్ సెన్సేషన్ సాధ్యమవుతుంది. ఇక 2017 నుంచి గత మూడు సంవత్సరాలుగా గమనిస్తే.. ఏడాదికో బోల్డ్ సీన్స్ ఉన్న సినిమా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. 2017లో అర్జున్ రెడ్డి, 2018లో ఆర్ ఎక్స్ 100, 2019లో ఇస్మార్ట్ శంకర్.. ఇలా సంవత్సరానికో సినిమా బోల్డ్ సీన్స్ తో బ్లాక్ బస్టర్ బాట పట్టింది. వీటిలో బోల్డ్ సీన్స్ ఎంతలా కుర్రకారుని ఎట్రాక్ట్ చేశాయో.. ఎమోషన్స్ కూడా అంతే బాగా పండాయి. ఫలితంగానే.. అవి సెన్సేషనల్ హిట్ అయ్యాయి.
ఇక ఈ సంవత్సరంలో ఇప్పటివరకు ఇలా సంచలనం సృష్టించిన సినిమా రానేలేదు. అయితే ఆ లోటు తీర్చడానికంటూ రేపు (డిసెంబర్ 18) ఓ బోల్డ్ కంటెంట్ రొమాంటిక్ థ్రిల్లర్ రాబోతోంది. అదే.. డర్టీ హరి. క్లీన్ ఎంటర్ టైనర్స్ కి కేరాఫ్ అడ్రస్ అయిన ప్రముఖ నిర్మాత ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో రూపొందిన ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్.. ఇటీవల విడుదలైన ట్రైలర్ తో ఇంప్రెస్ చేసింది. ఇదేమీ బూతు సినిమా కాదని.. సమ్ థింగ్ స్పెషల్ అనిపించేలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్న ఎమోషనల్ మూవీ అని స్పష్టమైంది. దీనికితోడు ఆర్ ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి, యాక్టర్ సునీల్, ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర సినిమా చూసి వేసిన ట్వీట్స్.. డర్టీ హరి ఒక సమ్ థింగ్ స్పెషల్ మూవీ అనే సంకేతాలను అందిస్తోంది. మరి చూడాలి.. పే ఫర్ వ్యూ పద్ధతిలో రేపు ఫ్రైడే మూవీస్ ఓటీటీలో రిలీజ్ కాబోతున్న ఈ రొమాంటిక్ థ్రిల్లర్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో.
కొసమెరుపు ఏంటంటే.. పైన పేర్కొన్న మూడు చిత్రాలు డైరెక్ట్ గా థియేటర్స్ లో రిలీజై వసూళ్ళ వర్షం కురిపిస్తే.. డర్టీ హరి ఏమో ఏటీటీలో డైరెక్ట్ గా రిలీజవుతోంది. కాసులు ఏ మేరకు కురిపిస్తుందో అన్నదాని బట్టి ఈ సినిమా రిజల్ట్ ఆధారపడి ఉంది. ప్రస్తుతానికైతే ఈ సినిమాకి యూత్ లో మంచి క్రేజే ఉంది.
![]() |
![]() |