![]() |
![]() |

సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్ర పోషిస్తోన్న వెబ్ సిరీస్ 'తాండవ్' టీజర్‌ను మేకర్స్ గురువారం ఆన్‌లైన్‌లో రిలీజ్ చేశారు. పేరుపొందిన ఫిల్మ్ డైరెక్టర్ అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్ట్ చేసిన ఈ సిరీస్ ఇప్పటికే సోషల్ మీడియాలో టాకింగ్ పాయింట్‌గా మారింది. పవర్ పాలిటిక్స్ నేపథ్యంలో, పవర్‌ఫుల్ క్యారెక్టర్స్‌తో పొలిటికల్ డ్రామాగా 'తాండవ్'ను అలీ అబ్బాస్ జాఫర్ రూపొందించాడు. బుధవారం తన అభిమానులకు అభివాదం చేస్తున్న పొలిటికల్ లీడర్‌గా రిలీజ్ చేసిన సైఫ్ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో టాప్ ప్లేస్‌లో ట్రెండ్ అవగా, గురువారం విడుదల చేసిన కొద్ది సేపటికే ట్రెండింగ్‌లోకి వచ్చింది 'తాండవ్' టీజర్.
"హిందుస్తాన్‌లో ఒకే విషయం నడుస్తుంటుంది.. అది రాజకీయం. ఈ దేశంలో ప్రధానమంత్రే రాజు" అంటూ బ్యాగ్రౌండ్‌లో వినిపిస్తుండగా.. సైఫ్ ఒక పైద్ద భవనంలోంచి నడుచుకుంటూ వచ్చి, కళ్లకు పెట్టుకున్న బ్లాక్ గాగుల్స్ తీసి, కింద తనకు జేజేలు కొడుతున్న వేలాది మంది జనానికి అభివాదం చేశాడు.. దీన్ని బట్టి అతను ప్రధాని పాత్రలో కనిపించనున్నాడనే అభిప్రాయం కలుగుతోంది.
ఈ టీజర్‌లో డింపుల్ కపాడియా, మహమ్మద్ జీషన్ అయూబ్, సునీల్ గ్రోవర్, కృతికా కమ్రా, సారా జేన్ డయాస్, కృతికా అవస్తి, డినో మోరియా, అనూప్ సోని, పరేష్ పహుజా లాంటి పేరుపొందిన నటులు కనిపిస్తున్నారు.
జనవరి 15న అమెజాన్ ప్రైమ్ వీడియోలో 'తాండవ్' విడుదలవుతోంది.
![]() |
![]() |