![]() |
![]() |

వెటరన్ డైరెక్టర్ వంశీ - మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా.. మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన కాంబినేషన్ ఇది. వీరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాల్లో కొన్ని కమర్షియల్ గా డిజప్పాయింట్ చేసి ఉండొచ్చేమో కానీ.. ఆడియో మాత్రం నెవర్ ఫెయిల్యూర్. అందుకే.. వంశీ - రాజాది ఎవర్ గ్రీన్ కాంబినేషన్.
అలాంటి ఈ ఇద్దరి కలయికలో వచ్చిన చిత్రాల్లో.. 1992 నాటి డిటెక్టివ్ నారద ఒకటి. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, ఆదిత్య 369 ఫేమ్ మోహిని జంటగా నటించిన ఈ సినిమాలోని పాటలన్నీ ఆదరణ పొందాయి. మొత్తం ఐదు పాటలున్న డిటెక్టివ్ నారద ఆల్బమ్ లో ప్రేమ యాత్రలకు అనే గీతానికి మాత్రం వంశీ బాణీ అందించారు. మిగిలిన నాలుగు పాటలు (ఝుమ్మని తుమ్మెద, లింగు లిటుకుల, కిలకిలమని, కొత్త పిట్టరో కోక్కో) ఇళయరాజా స్వరకల్పనలో రూపొందాయి.
అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ.. డిటెక్టివ్ నారద పేరు చెప్పగానే గుర్తుండిపోయే ఈ పాటలు వెంటాడతాయి. ఈ గీతాలన్నింటిలోనూ మోహన్ బాబుకి స్వర్గీయ గాయకులు ఎస్పీ బాలసుబ్రమణ్యం గాత్రమందించారు.
![]() |
![]() |