![]() |
![]() |

దర్శకుడిగా గోపీచంద్ మలినేనిది పదేళ్ళ ప్రస్థానం. ఈ ప్రయాణంలో విక్టరీ వెంకటేష్, మాస్ మహరాజా రవితేజ వంటి స్టార్స్ తో సినిమాలు చేశాడు గోపి. ప్రస్తుతం తన లక్కీ హీరో రవితేజతో ముచ్చటగా మూడో చిత్రం చేస్తున్నాడు. క్రాక్ పేరుతో రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ 2021 సంక్రాంతికి థియేటర్స్ లో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో.. గోపీచంద్ నెక్స్ట్ వెంచర్ పై ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వచ్చింది.
ఈ సారి నటసింహ నందమూరి బాలకృష్ణతో గోపీచంద్ మలినేని సినిమా చేయబోతున్నాడట. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ భారీ బడ్జెట్ వెంచర్ ని హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుందని సమాచారం. త్వరలోనే బాలయ్య, గోపీచంద్ కాంబినేషన్ మూవీపై క్లారిటీ వస్తుంది. మరి.. బాలయ్య కాంబినేషన్ తో గోపీచంద్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.
కాగా, క్రాక్ లో రవితేజ, శ్రుతి హాసన్ హీరోహీరోయిన్లుగా నటింస్తుండగా యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందిస్తున్నాడు.
![]() |
![]() |