గౌతమ్ కిచ్లూతో గత నెలాఖరున కాజల్ అగర్వాల్ పెళ్లి జరిగింది. పెళ్లైన వెంటనే పూజలు, పునస్కారాలు పూర్తి చేసుకుని కొత్త జంట హనీమూన్ కి వెళ్ళింది. పెళ్ళై పదిహేను రోజులు కూడా కాలేదు... పైగా హనీమూన్‌లో ఉంది కాబట్టి ప్రొఫెషనల్ వర్క్స్, కమిట్మెంట్ల పట్ల కాజల్ కొంచెం దూరంగా ఉంటుందని అనుకుంటున్నారేమో? అస్సలు కానే కాదు. కాజల్ దగ్గర పర్సనల్, ప్రొఫెషనల్... దేని స్పేస్ దానిదే. ఓ వైపు భర్తతో కలిసి మాల్దీవుల్లో హనీమూన్ ఎంజాయ్ చేస్తూనే... మరోపక్క ఆన్‌లైన్‌లో ఆదాయం వచ్చే పనులను చక్కబెడుతున్నారు.
మాల్దీవుల నుండి ఓకీ గేమింగ్ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన సంగతి కాజల్ అగర్వాల్ వెల్లడించారు. అక్కడ నుండి బాలీవుడ్ మీడియాకి ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఆఫర్ల గురించి ఒక స్టోరీ చేసి పెట్టారు.
ఇన్‌స్టాలో కాజల్ అగర్వాల్ ఫాలోయర్ల సంఖ్య 16 మిలియన్స్. కోటిన్నర కంటే ఎక్కువ అన్నమాట. ఆమె ఇన్‌స్టాలో ఒక స్టోరీ పోస్ట్ చేస్తే... తీసుకొనే మొత్తం కూడా అంతే రేంజ్ లో, భారీగా ఉంటుందని టాక్. దాంతో హానీమూన్‌లోనూ కాజల్ సంపాదన తగ్గలేదుగా అని సినిమా జనాలు సరదాగా కామెంట్లు చేసుకుంటున్నారట.