ఈ రోజు అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన 'ఆకాశం నీ హద్దురా' మూవీలో మరోసారి తన పెర్‌ఫార్మెన్స్ తో మెస్మరైజ్ చేశారు కోలీవుడ్ స్టార్ సూర్య. కెరీర్ బెస్ట్ పెర్‌ఫార్మెన్స్ తో అటు ప్రేక్షకుల, ఇటు విమర్శకుల ప్రశంసలు పొందుతున్నారు. ఒకవైపు ఈ విజయాన్ని ఆస్వాదిస్తూనే.. మరోవైపు కొత్త చిత్రానికి సంబంధించి రంగం సిద్ధం చేసుకుంటున్నారట సూర్య.
ఆ వివరాల్లోకి వెళితే.. 'కాక్క కాక్క' ('ఘర్షణ' మాతృక), 'వానరమ్ ఆయిరమ్' (తెలుగులో 'సూర్య సన్నాఫ్ కృష్ణన్') చిత్రాల తరువాత దర్శకుడు గౌతమ్ మీనన్ కాంబినేషన్ లో మరో సినిమా చేసేందుకు ఇప్పటికే సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కాగా దీపావళి తరువాత ఈ క్రేజీ వెంచర్ సెట్స్ పైకి వెళుతుందని సమాచారం. గౌతమ్ కాంబినేషన్ లో చేసిన గత రెండు చిత్రాల తరహాలోనే ఇందులో కూడా సరికొత్త పాత్రలో కనిపిస్తారట సూర్య. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి మరింత సమాచారం వెలువడుతుంది.