హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య నుండి బాలీవుడ్ ఇంకా కోలుకోలేదు. బాలీవుడ్ బుల్లితెర నటుడు సమీర్ శర్మ సైతం లాక్ డౌన్ లో ముంబైలోని తన అపార్ట్మెంట్ లో ఆత్మహత్య చేసుకున్నారు. వీళ్ళ ఆత్మహత్యలకు తోడు రిషి కపూర్, ఇర్ఫాన్ ఖాన్, వాజిద్ ఖాన్, సరోజ్ ఖాన్ తదితరుల మరణాలు హిందీ సినిమా ఇండస్ట్రీని శోక సంద్రంలో ముంచాయి. ఇప్పుడు మరో నటుడి ఆత్మహత్య వార్త బాలీవుడ్ ని షాక్ కి గురి చేసింది. అసలు వివరాల్లోకి వెళితే...
'జబ్ బయ్ మెట్', 'క్రిష్ 3', 'ఏక్ విలన్' తదితర సినిమాలతో పాటు 'పాతాళ లోక్', 'హోస్టేజెస్' వంటి వెబ్ సిరీస్ లలో నటించిన ఆసిఫ్ బస్రా ఆత్మహత్యకు పాల్పడ్డారు. హిమాచల్ ప్రదేశ్ లో గల ధర్మశాలలో గత ఐదేళ్ల నుండి అద్దెకు ఉంటున్న అపార్ట్మెంటులో ఉరి వేసుకున్నారు. ఆయన మృతికి గల కారణాలు ఇంకా తెలియలేదు. పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఆసిఫ్ బస్రా మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.