'అఖిల్'తో తెలుగు తెరపై మెరిసిన అందం సాయేషా సైగల్. ఆపై తమిళ చిత్రాలతో బిజీ అవడమే కాకుండా అక్కడి స్టార్ అయిన ఆర్యని పెళ్ళిచేసుకుని తమిళనాట స్థిరపడ్డారామె. కట్ చేస్తే.. ఐదేళ్ళ విరామం తరువాత మళ్ళీ నటసింహ నందమూరి బాలకృష్ణ తాజా చిత్రంతో తెలుగులో రీ-ఎంట్రీ ఇస్తున్నారు ఈ టాలెంటెడ్ బ్యూటీ.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో సాయేషా పాత్రకు సంబంధించి ఆసక్తికరమైన విషయం తెలిసింది. వినిపిస్తున్న కథనాల ప్రకారం.. BB3లో సాయేషా ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారట. చాలా పవర్‌ఫుల్‌గా ఉండే ఈ రోల్‌లో అన్ని రకాల డైమన్షన్స్ ఉంటాయని టాక్. సాధారణంగా స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్లకు పెర్‌ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ దొరకడం కష్టం. మరి.. అలాంటి అరుదైన అవకాశం అందిపుచ్చుకున్న సాయేషా.. ఏ మేరకు తన పాత్రకు న్యాయం చేస్తారో చూడాలి.
బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ 2021 వేసవిలో జనం ముందుకు రానుంది.