'ఆర్య', 'ఆర్య 2' తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా 'పుష్ప'. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో నెవర్ సీన్ బిఫోర్ అవతార్ లో దర్శనమివ్వనున్నారు బన్నీ. అంతేకాదు.. సరికొత్త మేకోవర్ తో మెస్మరైజ్ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ నెల 10వ తేది నుంచి రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభమైంది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో విలన్ పాత్రలో కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి నటించాల్సింది. అయితే కొన్ని కారణాల వల్ల విజయ్ నో చెప్పారు. ఈ నేపథ్యంలో.. పలువురి పేర్లు వినిపించాయి. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. మరో కోలీవుడ్ స్టార్ ఆర్య ఇందులో ప్రతినాయకుడిగా కనిపిస్తారట. అదే గనుక నిజమైతే.. 'వరుడు' తరువాత బన్నీకి ఆర్య విలన్ గా నటించే సినిమా ఇదే అవుతుంది. 'వరుడు' సినిమా ఫెయిలైనా అందులో భయంకరమైన విలన్‌గా ఆర్య రాణించాడు. ఆర్య, బన్నీ మధ్య యాక్షన్ సీక్వెన్స్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. త్వరలోనే పుష్పలో ఆర్య ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.