హీరోయిన్లు అందరూ ఎక్కువగా మిస్ అయ్యేది ఇంటి భోజనాన్ని! అందువల్ల, హోమ్ ఫుడ్ కోసం ఎదురు చూస్తుంటారు. అవుట్ డోర్ షూటింగ్ కు వెళ్ళినప్పుడు హోం ఫుడ్ దొరికితే వాళ్ళ ఆనందానికి అవధులు ఉండవు. అటువంటి ఆనందంలోనే లావణ్య త్రిపాఠి ఉన్నారు.
సందీప్ కిషన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా 'ఏ1 ఎక్స్ ప్రెస్'. హాకీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి కథానాయక. విశేషమేంటంటే వీళ్లిద్దరూ హాకీ క్రీడాకారులుగా కనిపించనున్నారు. సినిమాలో పతాక సన్నివేశాల చిత్రీకరణ కోసం యూనిట్ చండీగఢ్ వెళ్ళింది. అక్కడ లావణ్యకు బంధువులు ఉన్నారు. షూటింగ్ చూడడానికి వాళ్ళు లొకేషన్ దగ్గరకు వెళ్లారు. వెళ్తూ వెళ్తూ లావణ్య త్రిపాఠి కోసం హోమ్ ఫుడ్ తీసుకువెళ్లారు. అదీ సంగతి!