ఇన్‌స్టాలో లేటెస్ట్ సెన్సేషన్ బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కుమార్తె సుహానా. ఇరవై ఏళ్ల చిన్నది ఈ మధ్య తరచూ ఫొటోలు పోస్ట్ చేస్తూ సందడి చేస్తోంది. షారుక్ కుమార్తె కావడం, అందంగా ఉండటంతో అప్పుడే ఆమెకు ఫ్యాన్ పేజీలు వచ్చాయి. రీసెంట్గా బ్లాక్ అండ్ వైట్ పోల్కా డాట్ ట్రెండీ డ్రస్‌లో ఫొటోలు దిగి పోస్ట్ చేసింది. "బేబీ లూయిస్ విట్టోన్ తో" అని కాప్షన్ కూడా ఇచ్చారు. పోల్కా డాట్ డ్రస్, నెయిల్ పోలిష్ కి మ్యాచింగ్ లిప్‌స్టిక్ కంటే ఆ బేబీ లూయిస్ మీద ప్రజల దృష్టి పడింది.
షారుక్ కుమార్తె సుహానా చేతిలో బేబీ లూయిస్ విట్టోన్ హ్యాండ్‌బ్యాగ్ ఖరీదు ఎంత? అని చాలామంది గూగుల్ చేయడం స్టార్ట్ చేశారు. దాని రేటు సుమారు 450 డాలర్లు. భారతీయ కరెన్సీలో 28 నుండి 35 వేల మధ్య ఉండవచ్చు అని సమాచారం. ఒకవేళ సామాన్యులు ఎవరైనా కొనాలంటే జేబు గుల్ల కావడం ఖాయం. షారుక్ కుమార్తెకు అంత రేటు పెట్టి బ్యాగ్ కొనడం పెద్ద విషయం కాదు కదా!