అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' రొమాంటిక్ పోస్టర్ ట్రోల్స్, సెటైర్స్కి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. సోషల్ మీడియాలో ఈ సినిమా పోస్టర్ మీద డిస్కషన్ ఒక రేంజ్లో ఉంది. అఖిల్ చెవులను కాలి వేళ్లతో పూజా హెగ్డే సుతారంగా తాకుతున్న పోస్టర్ కొందరికి రొమాంటిక్‌గా అనిపించింది. మరికొందరు దానిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పోస్టర్ విడుదలైన వెంటనే సమంతను టార్గెట్ చేశారు.
'1 నేనొక్కడినే'లో మహేష్ బాబు నడుస్తూ వెళుతుంటే వెనుక హీరోయిన్ కృతి సనన్ పాకుతున్న స్టిల్ విడుదల చేసినప్పుడు దానిపై 'రిగ్రెస్సివ్' అని సమంత కామెంట్ చేశారు. అప్పుడు మాట్లాడిన సమంత ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉందని సోషల్ మీడియాలో కొందరు ప్రశ్నించారు. మీమ్స్ కూడా వచ్చాయి. అయితే, ఆ తరవాత టాపిక్ పూజా హెగ్డే మీదకు వచ్చింది. అఖిల్‌కి, ఆమెకి మధ్య ఏజ్ గ్యాప్ హాట్ టాపిక్ అయ్యింది.
అఖిల్ వయసు 26 ఏళ్ళు. పూజా హెగ్డేకి 29 ఏళ్ళు. అఖిల్ కంటే ఆమె మూడేళ్లు పెద్ద. ఈ విషయాన్ని అక్కినేని అభిమానులు కొందరు పాయింట్ అవుట్ చేశారు. "అనూ ఇమ్మాన్యుయేల్, నివేదా థామస్ వంటి 25 ఏళ్లలోపు హీరోయిన్లు ఇండస్ట్రీలో చాలామంది ఉండగా, అఖిల్ కంటే మూడేళ్లు పెద్దదైన పూజా హెగ్డేను ఎందుకు సెలెక్ట్ చేశారు?" అని ట్విట్టర్లో ఒకరు కామెంట్ చేశారు. "ఇద్దరికీ మూడేళ్లు గ్యాప్ ఉంది. ఖలేజా కాంబో (మహేష్ కంటే వయసులో అనుష్క పెద్ద) గుర్తు వచ్చింది" అని ఇంకొకరు కామెంట్ చేశారు.