ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తండ్రి కమ్ముల శేషయ్య శనివారం కన్నుమూశారు. కొంత కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజు ఉదయం 6 గంటలకు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 89 సంవత్సరాలు. సికిందరాబాద్‌లోని పద్మారావునగర్‌లో సాయంత్రం అంత్యక్రియలు జరుగుతాయని ఆయన కుటుంబసభ్యులు తెలిపారు.
శేషయ్యకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. శేఖర్ కమ్ముల అందరిలోకీ చిన్నవాడు. పెద్ద కుమారుని పేరు చంద్రశేఖర్. డైరెక్టర్ శేఖర్ కమ్ముల ప్రస్తుతం నాగచైతన్య, సాయిపల్లవి జంటగా 'లవ్ స్టోరి' మూవీ తీస్తున్నాడు. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.