ప్రైమ్ మినిస్టర్ నరేంద్రమోడీకి లేట్ బాలీవుడ్ యాక్టర్ సుశాంత్ సింగ్ రాజ్పుత్ సిస్టర్ శ్వేతా సింగ్ కృతి ఒక ఓపెన్ లెటర్ రాశారు. సోషల్ మీడియాలో తన సోదరుడి ఆత్మహత్య కేసులో జోక్యం చేసుకోవాల్సిందిగా ప్రధానిని ఆమె రిక్వెస్ట్ చేశారు.
సుశాంత్ సూసైడ్ కేసు ఇప్పటికి చాలా ట్విస్టులు, టర్నులు తీసుకుంది. పలు అనుమానాలు, ఆరోపణల మధ్య రోజుకొక కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తి మీద సుశాంత్ తండ్రి కంప్లయింట్ ఇవ్వడంతో కేసు కొత్త మలుపు తీసుకుంది. తాజాగా సుశాంత్ సిస్టర్ మోడీని ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో ఓపెన్ లెటర్ రాశారు.
"డియర్ సార్... మీరు నిజాయతీ వైపు నిలబడతారని నా మనసు చెబుతోంది. మేం చాలా సాధారణ కుటుంబానికి చెందివాళ్ళం. హిందీ సినిమా ఇండస్ట్రీలో నా సోదరుడు సుశాంత్ కి గాడ్ ఫాదర్ ఎవరూ లేరు. అలాగే, మాకూ ఇప్పుడు ఎవరూ లేరు. మీరు కేసును పరిశీలించి, ఆధారాలు మాయం కాకుండా పరిశుభ్రమైన రీతిలో విచారణ జరిగేలా చూస్తారని ఆశిస్తున్నానున్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను" అని శ్వేతా సింగ్ కృతి పేర్కొన్నారు.