![]() |
![]() |

భారతదేశం గర్వించదగ్గ దర్శకుడు, లెజెండరీ డైరెక్టర్ అంటే ముందుగా మణిరత్నం పేరే చెప్పుకోవాలి. ఇక నటునిగా చెప్పుకోవాలంటే భారత దేశంలోనే అత్యుత్తమ నటుడు విశ్వ నటుడు కమల్ హాసన్ అని ఒప్పుకొని తీరాలి. అలాంటి వీరిద్దరి కాంబినేషన్లో గతంలో నాయకుడు చిత్రం వచ్చి ఆస్కార్ వరకు వెళ్ళింది. ఆనాడు మీడియా ఇంత విస్తృతంగా లేదు గాని ఈ చిత్రం సృష్టించిన ప్రభంజనం అంతా ఇంత కాదు. కాగా కొంతకాలంగా కమల్ హాసన్ కు, మణిరత్నంకు సరైన హిట్లు లేవు. కానీ కమల్ హాసన్ లోకేష్ కనకరాజు దర్శకత్వంలో నటించిన విక్రమ్ చిత్రం ద్వారా బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టి మరోసారి పాన్ ఇండియా వైడ్ గా తన సత్తా చాటుకున్నారు. మరోవైపు మణిరత్నం కూడా పొనియన్ సెల్వన్ 1 ద్వారా మరోసారి ఫామ్ లోకి వచ్చారు. ఈ చిత్రం సెకండ్ పార్ట్ కూడా ఇదే ఏడాది విడుదల కాబోతోంది.
ఇదిలా ఉంటే అతి త్వరలో మణిరత్నం- కమల్ హాసన్ కలయికలో మరో చిత్రం రానుంది. 1987లో వచ్చిన నాయకుడు తర్వాత వారు చేస్తున్న చిత్రం ఇది. అంటే దాదాపు 35 ఏళ్ల తర్వాత వీరి కాంబినేషన్ రిపీట్ అవుతోంది. ఈ సినిమా కమల్ హాసన్ కు 234వ చిత్రం. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించిన మరో క్రేజీ అప్డేట్ వైరల్ అవుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో ఇండియా మొత్తం మీద అన్ని భాషలకు చెందిన ఎనిమిది మంది స్టార్స్ ను మణిరత్నం ఎంపిక చేయబోతున్నట్టు సమాచారం. బాలీవుడ్ నుంచి షారుఖ్ ఖాన్ ను కీలక పాత్ర కోసం ఎంపిక చేశారట. కమల్ హాసన్- మణిరత్నం కాంబోలో చిత్రం అంటే ఏ భాషలో అయినా ఎంతటి గొప్ప స్థానంలో ఉన్న నటీనటులైన ఆయన చిత్రాల్లో కనిపించేందుకు ఓకే చెబుతారు. దాంతో ఈ చిత్రం ఇండియాలోనే బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీగా మారుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
![]() |
![]() |